BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాల గులాబ్ జామూన్

Photo of Gulaab jamoon by Anitha Rani at BetterButter
0
2
0(0)
0

పాల గులాబ్ జామూన్

Nov-10-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
59 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల గులాబ్ జామూన్ రెసిపీ గురించి

చాలా ప్రాచీన మైన 100 సంవత్సరాల క్రిందటి స్వీట్. మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు..పాలు తో చేసే అత్యంత రుచికరమైనది.. చిన్న పిల్లలనుండి వృద్ధులు వరకు తిన గలిగే మెత్తని స్వీట్....

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. చిక్కని పాలు 1 లీ
  2. చెక్కర 150 గ్రా
  3. మైదా 100గ్రా
  4. వంట షోడా పొడి1/2 టేబుల్ స్పూన్
  5. యాలకులపొడి 1/2 స్పూన్
  6. నెయ్యి 1స్పూన్
  7. నూనె సరిపడినంత

సూచనలు

  1. చిక్కని పాలు తీసుకొని బాగా మరిగించాలి.
  2. చిక్కాగా నీరు లేకుండా అయిన పాలలో మైదా,వంట సోడా వెయ్యాలి.
  3. స్టవ్ ఆఫ్ చేసి పిండి గారిట తో బాగా కలపాలి.
  4. పిండి ని ఈ విధముగా కలపాలి.
  5. చేతి తో బాగా మెత్తగా కలపాలి.
  6. కొద్దిగా నెయ్యి రాసుకొని 5 ని తరువాత ఉండలు చేసుకోవాలి.
  7. మనకు కావలసిన షేప్ లో చేసుకోవచ్చు.
  8. స్టవ్ పైన పాన్ పెట్టి చెక్కర వేసి కొద్దిగా నీరు పోసి తీగ పాకము వచ్చే వరకు ఉంచియాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  9. స్టవ్ పైన బాండీ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి చిన్న మంట పెట్టుకొని ..ముందుగా చేసుకొన్న జామూన్ లు నూనె లో వేసుకోవాలి.
  10. బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి.
  11. వేగిన జామూన్ లను చక్కెర పాకము లో వేసి 10ని అలాగే ఉందా నివ్వాలి.
  12. చల్లారిన తరువాత సర్వింగ్ చేసుకోవాలి.
  13. రుచి కరమైన పాలతో చేసిన గులాబ్ జామూన్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర