హోమ్ / వంటకాలు / ఖర్జూరం నువ్వులు ఓట్స్ డ్రైఫ్రూట్స్ రోల్స్

Photo of Dates dry fruits and oats rolls by Lalitha Kandala at BetterButter
481
2
0.0(0)
0

ఖర్జూరం నువ్వులు ఓట్స్ డ్రైఫ్రూట్స్ రోల్స్

Nov-11-2018
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖర్జూరం నువ్వులు ఓట్స్ డ్రైఫ్రూట్స్ రోల్స్ రెసిపీ గురించి

ఖర్జూరం, ఓట్స్, నువ్వులు, జీడిపప్పు, బాదం, walnuts , ఎండుద్రాక్ష అన్ని ఆరోగ్యానికి మంచివి. వీటి అన్నింటినీ కలిపి తియ్యని రోల్స్ ల చేసుకుని తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2 కప్స్ ఖర్జూరం గింజలు తీసినవి
  2. 1 కప్ ఓట్స్
  3. 1 కప్ నువ్వులు
  4. 1 కప్ బాదం పప్పులు
  5. 1 కప్ జీడిపప్పులు
  6. 1/2 కప్ walnuts
  7. 1/2 కప్ ఎండు ద్రాక్ష
  8. 1/4 స్పూన్ యాలకుల పొడి
  9. నెయ్యి 1/4 కప్

సూచనలు

  1. 1. ఖర్జూరం వేడి పాలల్లో వేసి 30 నిమిషాలు నానబెట్టాలి
  2. 2. బాదం పప్పు వేడి నీళ్ళల్లో వేసి 15 నిమిషాలు నానబెట్టి పొట్టు తీయాలి
  3. 3. ఒక పాన్ లో బాదం పప్పు, జీడిపప్పు, ఓట్స్, నువ్వులు, కిస్మిస్ , walnuts అన్ని ఒకదాని తరువాత ఒకటి దోరగా వేయించుకోవాలి
  4. 4. నానబెట్టిన ఖర్జూరం ను మెత్తగా పేస్ట్ ల మిక్సీలో వేసి రుబ్బుకోవాలి
  5. 5. ఆ పేస్ట్ ను పాన్ లో నెయ్యి వేసి కాసేపు ఉడికించాలి
  6. 6. నట్స్ అన్ని చల్లారాక మెత్తగా పొడి లా చేసుకోవాలి
  7. 7. ఇప్పుడు ఖర్జూరం పేస్ట్ , యాలకుల పొడి , నట్స్ పొడి అన్ని వేసి, నెయ్యి వేసి పెద్ద పెద్ద రోల్స్ ల చేసుకుని ఒక అల్లుమినియం ఫాయిల్ లో పెట్టి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి
  8. 8. వాటిని తీసి చిన్న చిన్న రోల్స్ లాగా కావాల్సిన ఆకారం లో కట్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర