హోమ్ / వంటకాలు / జాంగ్రీలు

Photo of JANGRIS by Pravallika Srinivas at BetterButter
429
4
0.0(0)
0

జాంగ్రీలు

Nov-13-2018
Pravallika Srinivas
300 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జాంగ్రీలు రెసిపీ గురించి

సాధారణంగా జీలేబీలు జాంగ్రీలు బయట ఎక్కువగా కొనుక్కుంటాము. ఇవి ఎలా చేయాలో తెలియక చాలా కష్టం అనుకుంటాం.చాలా తేలిగ్గా చేసుకోవచ్చు .ఈ జాంగ్రీలు మినప్పిండి తో చేసుకుంటాం.తయారీ విధానం చూసేదామా?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మినపప్పు - 1 కప్పు
  2. ఫుడ్ కలర్ - 1/4 స్పూను
  3. పంచదార - 1 కప్పు
  4. నీరు - 1 కప్పు
  5. నెయ్యి - 1 కప్పు
  6. నూనె - 1 కప్పు
  7. యాలుకలు - 5/6

సూచనలు

  1. ముందుగా మినపప్పుని నీటిలో 5 గంటలు నానా పెట్టుకోవాలి.
  2. ఆ తర్వాత మిక్సర్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండర్ లో వేస్తే బాగా వస్తాయి.
  3. ఇప్పుడు రుబ్బిన పిండిలో ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి.అవసరం అయితే కొంచం నీరు వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక గిన్నెలో పంచదార నీరు వేసి కలిపి తీగ పాకం తీసుకోవాలి. చివరిగా దంచిన యాలుకలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
  5. ఇప్పుడు కడాయిలో సగం నూనె సగం నెయ్యి వేసి చిన్నమాట పైన కాగానివ్వాలి.
  6. ఈలోగా ఒక జిప్ లాక్ బాగ్ లో తయారు చేసిన పిండి వేసుకొని లాక్ చేసుకోవాలి.
  7. మొత్తం ఒక కోను లాగా చేసి మూలన కత్తెర తో చిన్న రాండ్రమ్ చేస్కోవాలి.
  8. ఇప్పుడు జాంగ్రీలను కడాయి లో చుట్టుకోవాలి.
  9. రెండువైపులా చిన్న మంటపైన వేయించుకోవాలి.
  10. బుడగలు ఆగిపోతే జాంగ్రీలు వేగాయి అని అర్థం .
  11. తయారైన జాంగ్రీలను పంచదార పాకం లో వేసి ఒక నిమిషం నొక్కి ఉంచాలి.
  12. ఇలా చేయడం వలన పాకం బాగా పడుతుంది అందులోనూ వేడి మీద వేసుకోవాలి.
  13. ఇప్పుడు మెల్లిగా ఒక్కోటి తీసుకుని ప్లేట్ లో వేసుకోవాలి.
  14. అంతే ఎంతో రుచికరమైన జాంగ్రీలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర