సేమియా పులిహోర | Vermicelli Pulihora Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  13th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Vermicelli Pulihora by Sudha Badam at BetterButter
సేమియా పులిహోరby Sudha Badam
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

27

0

సేమియా పులిహోర వంటకం

సేమియా పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vermicelli Pulihora Recipe in Telugu )

  • సేమియా 1/4 కేజీ
  • నిమ్మకాయ 1
  • నూనె 4 స్పూన్లు
  • పోపు దినుసులు-మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, వేరుసేనగగుళ్లు, జీలకర్ర, ఎండుమిర్చి
  • పచ్చిమిర్చి 4
  • కరివేపాకు 2 రెమ్మలు
  • ఉప్పు తగినంత
  • పసుపు 1 టీ స్పూన్

సేమియా పులిహోర | How to make Vermicelli Pulihora Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని, 500 ml నీళ్లు పోసి ఒక స్పూను నూనె, ఒక స్పూను ఉప్పు వేసి బాగా మరగనిచ్చి సేమియా వేసి ఉడకనివ్వాలి.
  2. సెమీయ ఉడికాక మిగిలిన నీళ్ళని వార్చేసి ఉడికిన సేమియా మీద చల్లటి నీళ్ళని పోసుకుని ఒక ప్లేట్ లో ఆరబెట్టుకోవాలి.
  3. స్టవ్ మీద పాన్ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె వేడెక్కాక పోపు దినుసులు, వేరుసెనగగుళ్ళు,ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి ఈ చల్లారిన సేమియా లో కలుపుకోవాలి.
  4. నిమ్మాయకని కోసుకుని రసం తీసుకుని ఈ సేమియా లో కలుపుకోవాలి.

Reviews for Vermicelli Pulihora Recipe in Telugu (0)