హోమ్ / వంటకాలు / జ్యూసీ రవ్వ బిల్లలు

Photo of Sooji sugar discs by Kavitha Perumareddy at BetterButter
360
10
0.0(0)
0

జ్యూసీ రవ్వ బిల్లలు

Nov-13-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జ్యూసీ రవ్వ బిల్లలు రెసిపీ గురించి

ఈ స్వీట్ చాలా జ్యూసీ గా తియ్యగా నోటిలో వేసుకుంటే కరిగిపోతుంది.చాలా బాగుంటుంది.అందరూ ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బొంబాయిరవ్వ ఒక కప్
  2. నెయ్యి 3 స్పూన్స్
  3. పాలు రెండు కప్పులు
  4. చెక్కర ఒక పెద్ద కప్
  5. యాలకుల పొడి స్పున్
  6. నూనె డీప్ ప్రై కు సరిపడా

సూచనలు

  1. ముందుగా పోయిమీద గిన్నె పెట్టి చెక్కర ,ప్పావుకప్ నీళ్లు పోసుకొని కాగనిచ్చి లేత పాకం రానివ్వాలి .గులాబీజామ్ పాకంలా ఉండాలి.పాకంలో యాలకుల పొడి వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి.
  2. తరువాత పోయిమీద బాండిపెట్టి నెయ్యి వేసి కాగనిచ్చి రవ్వ వేసుకొని కలిపి కాసేపు వేయించుకోవాలి.
  3. తరువాత కాగినపాలు వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపి ఉడికించుకోవాలి.దగ్గరగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  4. ఉడికించుకున్న రవ్వను ఒక గిన్నెలో తీసుకొని చల్లారనివ్వాలి.తరువాత చేతికి నెయ్యి రాసుకొని రవ్వని బాగా చెప్పాతి పిండిలాగా వచ్చేలా మర్దన చేసుకోవాలి.
  5. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చెప్పాతి లా ఒత్తుకొని రౌండ్ గా వుండే కట్టర్ తీసుకొని బిల్లలు చేసుకోవాలి.మందంగా ఒత్తుకోవాలి .మరీ పలుచగా వత్తుకోకూడదు.
  6. ఇలా అంత పిండిని బిల్లలుగా చేసుకోవాలి.
  7. తరువాత పోయిమీద బాండిపెట్టి డీప్ ప్రై కు సరిపడా నూనె పోసి కాగనిచ్చి రవ్వ బిల్లలు వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని తీసి వెంటనే పాకంలో వేసుకోవాలి.ఇలా అన్ని వేసుకోవాలి.
  8. పాకం బాగా పీల్చుకున్న తరువాత రవ్వ బిల్లలను వేరే ప్లేట్ లో తీసుకోవాలి .అంతే ఎంతో జూసిగా వుండే రవ్వ బిల్లలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర