హోమ్ / వంటకాలు / ఆవపెట్టిన చింతపండు పులిహోర

Photo of Mustard Tamarind Rice by Pravallika Srinivas at BetterButter
890
2
0.0(0)
1

ఆవపెట్టిన చింతపండు పులిహోర

Nov-14-2018
Pravallika Srinivas
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవపెట్టిన చింతపండు పులిహోర రెసిపీ గురించి

ఈ ఆవపెట్టిన పులిహోర గోదావరి జిల్లా వారు చేస్తుంటారు.చాలా రుచిగా ఆవ రుచితో కమ్మగా ఉంటుంది.మాములు చింతపండు పులిహోర కన్నా వేరుగా ఉంటుంది.ఇది పండుగలకు దేవుడికి నైవేద్యానికి పెడతారు.ఎలా తయారు చేయాలో చూసేద్దామ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం - అర కేజి
  2. నీరు - తగినంత
  3. ఆవనూనె - తగినంత
  4. ఆవాలు - 3 స్ఫూన్లు
  5. పోపు దినుసులు - 2 స్పూన్లు
  6. పచ్చిపప్పు - 2 స్ఫూన్లు
  7. పల్లీలు - 3 స్పూన్లు
  8. కరివేపాకు - ౩ రెమ్మలు
  9. పసుపు - 1/2 స్పూను
  10. ఇంగువ - చిటికెడు
  11. యండుమిర్చి - 10
  12. పచ్చిమిర్చి -1౦
  13. చింతపండు - పెద్దనిమ్మకాయంత
  14. బెల్లం - చిన్న ముక్క

సూచనలు

  1. ముందుగా 2 స్పూన్ల ఆవలను నీటిలో ఒక గంట నానపెట్టుకోవాలి.పచ్చిపప్పు ని కూడా మరొక గిన్నీలో నానపెట్టుకోవాలి.చింతపండుని వేడి నీటిలో వేసి నానపెట్టుకోవాలి.
  2. బియ్యం ని నానపెట్టి పొడిపొడిగా ఉడికించుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో ఆవాలను వేసి పేస్ట్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఈ ఆవపేస్ట్ లో పసుపు,ఉప్పు,నూనె వేసుకోవాలి.
  5. ఒక స్పూను తో బాగా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు వేడి వేడి అన్నాన్ని ఒక వెడల్పు ప్లేట్ లో వేసుకోని మధ్యలో గుంత లాగా చేసుకోవాలి.
  7. ఇప్పుడు ఆ గుంతలో తయారు చేసిన ఆవ పేస్ట్ వేసుకోవాలి.
  8. ఇప్పుడు పక్కన ఉన్న అన్నంతో కప్పివేయాలి.
  9. పైన గట్టిగా అదిమి మూత పెట్టుకోవాలి.ఇలా చేయడం వలన అన్నంలోని వేడికి ఆవపేస్ట్ ఉడికిపోతుంది.
  10. ఇప్పుడు కడాయిలో నూనె వేసి కాగాక వేరుశనగలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  11. ఇప్పుడు అదే కడాయిలో నానపెట్టిన పచ్చిపప్పు వేసి వేయించుకోవాలి.గుల్లగా వచ్చాక అందులో పోపుదినుసులు,పచ్చిమిర్చి చీలికలు,ఎండుమిర్చి,ఇంగువ,కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  12. పోపు వేగాక పసుపు,ఉప్పు,చింతపండు పులుసు వేసి ఉడకనివ్వాలి.
  13. చిన్న బెల్లం ముక్క వేసి ఉడికిన తర్వాత కడాయి ని నూనె విడుస్తుంది.
  14. ఇప్పుడు ప్లేట్ లోని అన్నాన్ని వేసి కలుపుకోవాలి.
  15. కలిపేటప్పుడు మీరు ఉడికిన ఆవ ముద్దని గమనించవచ్చు.
  16. వేయించిన పల్లీలు వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి.
  17. అంతే ఎంతో రుచికరమైన ఆవపెట్టిన పులిహోర సిద్ధం. సెర్వింగ్ బౌల్ లో తీసుకుని నైవేద్యానికి పెట్టుకుని పూజ తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర