హోమ్ / వంటకాలు / బేసన్ లడ్డూ (మైక్రోవేవ్ వెర్షన్,6 నిమిషాల్లో లడ్డూ)

Photo of Besan laddu(microwave version,laddu in six minutes) by Sukriti Siri at BetterButter
517
5
0.0(0)
0

బేసన్ లడ్డూ (మైక్రోవేవ్ వెర్షన్,6 నిమిషాల్లో లడ్డూ)

Nov-14-2018
Sukriti Siri
5 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేసన్ లడ్డూ (మైక్రోవేవ్ వెర్షన్,6 నిమిషాల్లో లడ్డూ) రెసిపీ గురించి

బేసిన్ లడ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి పండుగ రోజుల్లో అతి సులువుగా ఏమాత్రం శ్రమ లేకుండా తేలికగా కేవలం 6 నిమిషాల్లో ,అవునండి 6 నిమిషాల్లో అది కూడా స్టవ్ వెలిగించకుండా మైక్రోవేవ్ లో చేసుకోవచ్చు.పది రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. పిన్నా పెద్దా అందరూ ఇష్టoగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • మైక్రోవేవులో చెయ్యటం
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 కప్పు : లడ్డూ బేసన్
  2. 4 టేబుల్ స్పూన్లు : మంచి నెయ్యి
  3. 8 టేబుల్ స్పూన్లు : పొడి చెక్కరి
  4. 1 చిన్న స్పూను : ఇలాయిచి పొడి
  5. తరిగిన పలుకులు ఇష్టానుసారం

సూచనలు

  1. ఒక గాజు గిన్నెలో కరిగించిన నెయ్యి, లడ్డూ బేసన్ వేసుకొని నెయ్యి పూర్తిగా పిండిలో కలిసేలా ఒక స్పూన్ తో కలుపుకోండి.
  2. ఈ గిన్నెని మైక్రోవేవ్ లో 100 శాతం పవర్ పై మూడు నిమిషాల పాటు, ప్రతీ నిమిషం కలుపుతూ రోస్ట్ చేసుకోండి.
  3. ఆ పిమ్మట పవర్ ని 50 శాతానికి తగ్గించి మరో మూడు నిమిషాల పాటు, ప్రతీ నిమిషం కలుపుతూ మరల రోస్ట్ చేసుకోండి.
  4. ఈ పాటికి కమ్మటి వాసన తో పాటు బంగారు రంగు వచ్చి బేసన్ పూర్తిగా వేగి రెడీ అవుతుంది.
  5. ఇప్పుడు ఈ పిండిని పూర్తిగా చల్లార బెట్టుకోండి.
  6. ఈ స్వీట్ చేయడం లో ఎక్కవు సమయం తీసుకునే ప్రక్రియ ఇదే , చల్లార బెట్టుకోవటం.
  7. చల్లారిన పిమ్మట పొడి చెక్కరి మరియు ఇలాయిచి పొడి వేసి బాగా కలిసేలా కలుపుకోండి.
  8. లడ్డూ మిశ్రమం ఇప్పుడు పూర్తిగా తయారయింది.
  9. పెద్ద చెంచాడు మిశ్రమం అరచేతిలో కి తీసుకొని లడ్డూలు చుట్టుకోండి.
  10. మీ ఇష్టానుసారం పలుకుల తో అలంకరించుకొని సర్వ్ చేసుకోండి.
  11. పైన చెప్పిన ఈ కొలతలతో సుమారు 10 లడ్డూలు తయారవుతాయి.
  12. ఈ పండగకి మీరూ ఈ లడ్డూలు చేసుకొని చూడండి , మీకూ తప్పకుండా నచ్చుతాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర