రవ్వ దద్దోజనం | Ravva curd rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  16th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Ravva curd rice by Sree Vaishnavi at BetterButter
రవ్వ దద్దోజనంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

రవ్వ దద్దోజనం వంటకం

రవ్వ దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ravva curd rice Recipe in Telugu )

  • 1/2 కప్ గోధుమ రవ్వ
  • 1 1/2 కప్ నీళ్లు
  • 1 1/2 కప్ పెరుగు
  • 1/2 కప్ పాలు
  • 1 1/2 చెంచా నూనె
  • 1/2 చెంచా ఆవాలు
  • 1/2 చెంచా జీలకర్ర
  • ఇంగువ చిటికెడు
  • 3/4 చెంచా సెనగపప్పు
  • 3/4 చెంచా మినపప్పు
  • 3-4 మిరియాలు
  • 2 చెంచాలు పల్లీలు
  • 1 చెంచా కాజు
  • 2 ఎండుమిర్చి
  • 2 పచ్చిమిర్చి
  • 1/2 అంగుళం అల్లం
  • నూనె 2 చెంచాలు

రవ్వ దద్దోజనం | How to make Ravva curd rice Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి
  2. అందులో గోధుమ రవ్వ వేసి మెత్తగా ఉడికించాలి
  3. ఇప్పుడు దానిని ఒక దాంట్లో తీసుకుని చల్లార్చుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు ,పాలు, పెరుగు వేసుకుని మెత్తగా లూస్ గ కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి
  6. అందులో నూనె వేసి వేడిఅయ్యాక అందులో ఆవాలు ,జీలకర్ర, పల్లీలు ,మినపప్పు ,సెనగపప్పు ,జీడిపప్పు ,మిరియాలు వేసి వేయించాలి
  7. వేగాక అందులో ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,అల్లం వేసి వేయించి చివరినా ఇంగువ వేసుకుని వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  8. దానిని తయారు చేసిన రవ్వ మిశ్రమం లో వేసుకుని బాగా కలిపి సర్వ్ చేయడమే

Reviews for Ravva curd rice Recipe in Telugu (0)