హోమ్ / వంటకాలు / పెరుగు ఆవడలు

Photo of CURD VADAS by Pravallika Srinivas at BetterButter
272
2
0.0(0)
0

పెరుగు ఆవడలు

Nov-16-2018
Pravallika Srinivas
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు ఆవడలు రెసిపీ గురించి

పెరుగు ఆవడలు చాలా మెత్తగా తినగానే కరిపోతాయి.పండగలప్పుడు గారెలు వడలు చేస్తూ ఉంటాము.అందులో చాలా రకాలు పెసలతో,అలసందలతో చేస్తూ ఉంటాము.ఈ ఆవిడ వేడిని తగ్గిస్తుంది.పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ముఖ్యంగా పొట్టు మినపప్పు వాడుకోవాలి కడగడం కొంచెము శ్రమ అయిన ఆవడలు చేసి తినేటప్పుడు అంత ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • చిలకడం
  • మిళితం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పొట్టు మినపప్పు - 1/2 కేజీ
  2. పెరుగు - అర లీటరు
  3. ఉప్పు - తగినంత
  4. నూనె - 1 స్పూను
  5. యండుమిర్చి - 5
  6. పోపు దినుసులు - 1 స్పూను
  7. కరివేపాకు - 2 రెమ్మలు
  8. అల్లం ముక్కలు - 1 అంగుళం
  9. పచ్చిమిర్చి - 2 ఘాటువి
  10. ఇంగువ - చిటికెడు
  11. పసుపు - 1/2 స్పూను

సూచనలు

  1. ముందుగా పొట్టు మినపప్పు 5 గంటలు నాననిచ్చి కడిగి పొట్టు వంపి గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  2. మీగడ పెరుగుని చిలకొట్టి ఉప్పు వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు తాలింపు కడాయి పెట్టి నూనె వేసి కాగాక యండుమిర్చి,పోపుదినుసులు, కరివేపాకు,అల్లం పచ్చిమిర్చి ముక్కలు,ఇంగువ ,పసుపు వేసి వేగనివ్వాలి.
  4. తయారైన పోపుని చిలికిన పెరుగులో వేసి కలుపుకోవాలి.
  5. మినపిండిలో ఉప్పు కలిపి వడలు వత్తుకుని చిల్లుపెట్టి కాగిన నూనెలో చిన్న మంటపైన దోరగా వేయించుకోవాలి.
  6. తయారైన వదలను నీటిలో ఒకసారి ముంచి పెరుగులో వేసుకోవాలి. ఇలా చేయడం వలన వడలు పెరుగుని త్వరగా నానిపోతాయి.
  7. మొత్తం అలాగే వేసి కొంచం లోపలికి మ్యూనిగేలాగా చూసుకుని మూత పెట్టి గంట నాననివ్వాలి.
  8. అంతే ఎంతో రుచికరమైన పెరుగు ఆవడలు సిద్ధం .దేవుడికి నివేదించి మనం ప్రసాదం గా తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర