హోమ్ / వంటకాలు / ఆలూ కచోరీ.

Photo of Aalu kachori by Chandrika Marripudi at BetterButter
606
2
0.0(0)
0

ఆలూ కచోరీ.

Nov-17-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ కచోరీ. రెసిపీ గురించి

ఆలూ కచోరీ. ఆలూతో కూర చేసి మైదా పిండిలో స్టఫింగ్ చేసి చేసే డీప్ ఫ్రై స్నాక్ ఐటమ్. సాయంత్రం టీ టైంకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా పిండి : 1/4 కేజీ
  2. బంగాళదుంపలు : 1/4 కేజీ
  3. ఉల్లిపాయలు : 2
  4. పచ్చిమిర్చి : 4
  5. ఎండుమిర్చి : 4
  6. వెల్లుల్లి రెబ్బలు : 10
  7. ఉప్పు : తగినంత
  8. జీలకర్ర : 2 స్పూన్లు
  9. వాము : 2 స్పూన్లు
  10. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. మైదా పిండిలో తగినంత ఉప్పు, నూనె, వాము వేసి నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి.
  2. ఆలూ ఉడికించి చల్లారాక తొక్కతీసి మెదిపి పెట్టుకోవాలి
  3. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు,తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి
  4. స్టవ్ పైన పాన్ పెట్టి 4 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక జీలకర్ర వేసి వేగాక మిక్సీ పట్టిన పేస్ట్ వేసి వేయించాలి.
  5. అది వేగాక ఆలూ ముద్దని వేసి కలుపుతూ వేయించి పక్కన పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు మైదాపిండి ముద్దని చిన్న చిన్న పూరీల్లా వత్తుకుని మధ్యలో ఆలూ ముద్దని పెట్టి చుట్టూ పైకి మడిచి చిన్నగా వత్తి పెట్టుకోవాలి.
  7. ఇలా చేసిన వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర