హోమ్ / వంటకాలు / సంపంగి పువ్వులు

Photo of Sweet flowers by lakshmi kumari at BetterButter
0
3
0(0)
0

సంపంగి పువ్వులు

Nov-18-2018
lakshmi kumari
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సంపంగి పువ్వులు రెసిపీ గురించి

చాలా సులువు, అందరికీ నచ్చుతాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్పు
  2. చక్కెర 1/2 కప్
  3. ఇలాచి పౌడర్ చిటికెడు
  4. ఉప్పు చిటికెడు
  5. డీప్ ఫ్రై కి సరిపడా నూనె

సూచనలు

  1. ముందుగా మైదా ఒక బౌల్లో తీసుకోవాలి.
  2. ఈ మైదాలో ఉప్పు, వేడి నూనె రెండు స్పూన్లు వేసి మునివేళ్ళతో కలుపుకోవాలి
  3. పిండి బ్రెడ్ క్రంబ్స్ మాదిరి వస్తుంది
  4. ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి
  5. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి
  6. పొయ్యి మీద మూకుడు పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి
  7. మైదా పిండిని చిన్న ఉండ చేసుకుని పూరీలా ఒత్తుకుని, కత్తితో మధ్యలో చిన్న చిన్నగ గాట్లు మాదిరి చేసుకోవాలి
  8. గాట్లు పెట్టిన పూరి ని రెండు కొనలు దగ్గరికి చేసుకొని పువ్వు షేప్ ఇవ్వాలి
  9. నూనె కాగాక ఈ పువ్వులను ఒక్కటే నూనెలో వేసి చిన్నమంటపై గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి
  10. ఒక బాణలిలో ఆఫ్ కప్పు పంచదార,1/4 కప్పు నీళ్ళు వేసి లేత తీగపాకం వచ్చేవరకు ఉడికించుకోవాలి
  11. ఇప్పుడు వేయించిన సంపంగి పువ్వు లని, ఈ పాకంలో వేసి గరిటతో అటూ ఇటూ తిప్పి తీసి పక్కన పెట్టుకోవాలి
  12. బాగా చల్లారాక డబ్బాలో పోసి మూత పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర