హోమ్ / వంటకాలు / బిసిబేళ బాత్

Photo of Bisi Bele Bath by Sudha Badam at BetterButter
680
5
0.0(0)
1

బిసిబేళ బాత్

Nov-18-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బిసిబేళ బాత్ రెసిపీ గురించి

కర్ణాటక cuisine లో ఒక ఫేమస్ రైస్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • కర్ణాటక
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1 కప్పు
  2. కందిపప్పు 1/2 కప్పు
  3. చింతపండు ఉసిరికాయంత
  4. పంచదార 2 స్పూన్లు
  5. ఉల్లిపాయ 1 పెద్దది
  6. క్యారెట్ 1
  7. బంగాళదుంప 1
  8. వంకాయ 1
  9. బీట్రూట్ చిన్న ముక్క
  10. టమాటా 1
  11. దొండకాయలు 2
  12. గ్రీన్ peas గుప్పెడు
  13. స్వీట్ కార్న్ గుప్పెడు
  14. పచ్చిమిర్చి 3
  15. పోపు దినుసులు-మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు
  16. కొత్తిమీర
  17. పసుపు
  18. ఉప్పు తగినంత
  19. బిసిబెళ బాత్ పౌడర్ 4 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా బియ్యం, కందిపప్పు కడిగి రెండు కలిపి కుక్కర్ లో3 whistles వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
  2. ఒక పాన్ లో 3 స్పూన్లు నూనె వేసి వేడెక్కాక పోపు దినుసులు,పచ్చిమిర్చి,ఎండుమిర్చి వేసి వేగనిచ్చి అన్ని కాయగూరలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని, వేసుకుని ఒక్కసారి వేగనిచ్చి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి.
  3. ముక్కలు మెతబడ్డాయి అనిపించాక చింతపండు రసం, ఇంకొద్దిగా నీళ్లు, ఉప్పు, పసుపు, పంచదార, బిసిబెళ బాత్ powder వేసి ఉడుకుతుండగా, ఉడికిన అన్నం కందిపప్పు మిశ్రమాన్ని వెయ్యాలి.
  4. అన్నీ కలిపి అవసరం అనుకుంటే ఒక అర గ్లాసు నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించాలి.
  5. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకొని , చిప్స్ తో సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర