హోమ్ / వంటకాలు / రసమలై కేకు (గుడ్డులేకుండా)

Photo of Rasmalai cake eggfree by Divya Konduri at BetterButter
81
5
0.0(0)
0

రసమలై కేకు (గుడ్డులేకుండా)

Nov-19-2018
Divya Konduri
180 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రసమలై కేకు (గుడ్డులేకుండా) రెసిపీ గురించి

పండు సమయంలో కొత్తగా ట్రై చేసాను..రసమలై చేసి దానితో కేకు చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కేకు కోసం : మైదా 150గ్రాములు
  2. పంచదార 100గ్రాములు
  3. పాలు ఒక కప్పు
  4. కండెన్స్ మిల్క్ ఒక కప్పు
  5. వెనీలా ఎసెన్స్ అర స్పూను
  6. బేకింగ్ సోడా అర స్పూను
  7. బేకింగ్ పౌడరు అర స్పూను
  8. బటర్ 50గ్రాములు
  9. రసమలై కోసం: పాలు లీటరు
  10. నిమ్మరసం ఒక స్పూను
  11. కార్నఫ్లొర్ అర స్పూను
  12. కుంకుమ పువ్వు అర స్పూను
  13. చర్రీలు అలంకరణ
  14. పిస్తా,బాదం,కిస్ మిస్ తరుగు ఒక కప్పు
  15. ఐసింగ్ ‍కోసం : హెవీ క్రీమ్ 200గ్రామ్స్
  16. ఐసింగ్ షుగర్ 100గ్రాములు
  17. వెనీల ఎసెన్స్ అర స్పూను

సూచనలు

  1. ముందుగా కేకు కోసం: గిన్నేలో బటర్ పంచదార పొడి వేసి బీటు చేయాలి
  2. తరువాత పిండి,కండెన్స్ మిల్క్ వేసి మళ్ళీ బీటు చేయాలి
  3. వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి
  4. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బీటు చేయాలి
  5. రౌండ్ కేక్ టిన్ లో వేసి 180డీగ్రల ఉష్ణోగ్రతలో 15నిమిషాలు బేక్ చేయాలి
  6. టూత్ పిక్ తో గుచ్చి టెస్టు చేయాలి
  7. రసమలై కోసం : పాలు మరిగించి పొంగు వచ్చాక నిమ్మరసం పిండి విరిగాక పలుచటి గుడ్డలోకి వంచి పిండి నీరు తీసేయాలి
  8. పళ్ళెంలోకి పాల విరుగుడు తీసుకొని కార్నుఫ్లొర్ వేసి అర చేతితో బాగా మర్దనా చేయాలి
  9. చిన్న ముద్దలు చేసి వత్తి ఉంచాలి
  10. నీళ్ళు గిన్నెలో పోసి, పంచదార , యాలకుల పొడి వేసి మరిగించాలి
  11. చేసిన రసమలై వేసి 15నిమిషాలు ఉడికించాలి
  12. రస కోసం : ఇంకో గిన్నైలో పాలు బాగా చిక్కగా అయ్యైల మరిగాక పంచదార, కుంకుమ పవ్వు , యాలకుల పొడి , పిస్తా బాదం ముక్కలు వేసి చిక్కగా మరిగించాలి
  13. రస గుల్లను పిండి మరిగించిన పాలలో వేసి అర గంట నాన నివ్వాలి
  14. ఐసింగ్ కోసం : హెవీ క్రీమ్ , ఐసింగ్ షుగర్ , వేనీల ఎసెన్స్ వేసి బీటు చేసుకోవాలి
  15. క్రిమ్ అయ్యాక ఒక కవర్ లోకి తీసుకోవాలి
  16. కేకును సగానికి కట్ చేయాలి
  17. కేకు అట్టపై క్రీము వేసి కొద్దిగా కోసిన కెకు పెట్టి బ్రెష్ తో రస్మలై పాలని స్రైడ్ చేయాలి
  18. రసమలైని మద్యలో పెట్టాలి పైన ఇంకో కేక్ స్లైస్ ని పెట్టాలి
  19. ఇప్పుడు ఐసింగ్ క్రిము మొత్తం కేకు కి పూసి పైన రసమలై చర్రీలతో అలంకరించాలి
  20. రెడీ అయ్యక ఫ్రిడ్జ్ లో 15నిమిషాలు పెట్టి కట్ చేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర