హోమ్ / వంటకాలు / ఖార్జురం మరియు డ్రై ఫ్రూట్స్ తో బర్ఫీ

Photo of Dates barfi with dry fruits by Shobha.. Vrudhulla at BetterButter
434
7
0.0(0)
0

ఖార్జురం మరియు డ్రై ఫ్రూట్స్ తో బర్ఫీ

Nov-19-2018
Shobha.. Vrudhulla
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖార్జురం మరియు డ్రై ఫ్రూట్స్ తో బర్ఫీ రెసిపీ గురించి

యి స్వీట్ చాలా మంచిది.హెల్దీ కూడాను. ఖజ్జూరo వలన రక్తము బాగా పెరుగును ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అని రకాలుగా మంచిదే.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఉత్తర భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. ఖార్జురం 2 కప్పులు
  2. జీడిపప్పు అర కప్పు
  3. బాదం పప్పు అరకప్పు
  4. పిస్తా అర కప్పు
  5. యాలుకల పొడి ఒక చెంచా
  6. గసగసాలు 3 / 4 చంచాలు
  7. నెయ్యి అర కప్పు

సూచనలు

  1. ముందుగా ఖజ్జూరాన్ని పిక్కలు లేకుండా చూసి కాస్త మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కాజు,పిస్తా,బాదాం ఈ మూడు కూడా చక్కగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవలెను
  3. గసగసాలు పొడిగా వేయించిపెట్టుకోవలెను.
  4. ఇప్పుడు ఖార్జురం లో నెయ్య వేసి 2నిమిషాల పాటు సిమ్ లో పెట్టి వేయించాలి
  5. వేగిన ఖార్జురం తీసి పెట్టుకొని , మళ్ళీ 2 చంచాల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించాలి
  6. ఇవి కూడా వేగాక ముందుగా వేయించిన ఖార్జురం, గసగసాలు కూడా ఈ ముకుడులో వేసి బాగా కలపాలి
  7. అన్ని కూడా ఖార్జురంతో బాగా కలిసిపోవాలి
  8. మూకుడు కిందకి దించి ఒక ప్లేట్ లో తీసి చేతితో బాగా కలపాలి
  9. కలిపిన తరువాత రోల్ లాగా చేయాలి
  10. చేసిన తరువాత గట్టు మీద చక్కగా మిగిలిన గసగసాలు మరియు పిస్తా ముక్కలు వేయాలి
  11. చేసి ఉంచిన రోల్ కి పిస్తా గసగసాల చుట్టూ తిప్పాలి
  12. దానివల్ల ఇవన్ని రోల్ కి చక్కగా అద్ది చాలా అందంగా కనిపిస్తుంది రోల్.
  13. ఇప్పుడు ఆ రోల్ ని ఒక ఫాయిల్ కవర్ లో పెట్టి తిప్పుతూ పూర్తిగా కవర్ చేయాలి.
  14. మొత్తం అంత కవర్ ఆయాక దాన్ని ఫ్రిడ్జ్ లో 3 గంటలు పెట్టాలి.
  15. తరువాత దాన్ని తీసి చక్కగా రౌండ్ గా కట్ చేసి పెట్టుకోవలెను
  16. అంతే ఖార్జుర్ బర్ఫీ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర