హోమ్ / వంటకాలు / అరటిపండు తో పాయసం

Photo of Banana kheer by Shobha.. Vrudhulla at BetterButter
550
2
0.0(0)
0

అరటిపండు తో పాయసం

Nov-19-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటిపండు తో పాయసం రెసిపీ గురించి

అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది.రోజు ఒక పండు తింటే వంటికి బలం చేకూరుతుంది .దీనిలో పిండి పదార్ధాలు చాలా ఎక్కువ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. అరటి పళ్ళు పండినవి 2
  2. పాలు 1 లీటరు
  3. పంచదార 1 కప్పు
  4. యాలుకల పొడి అర చెంచా
  5. చారోలి 2 చంచాలు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద పాలు పెట్టి పొంగిన తరువాత సగం అయ్యే వరకు మరగ నివ్వాలి
  2. అలా మరిగిన తరువాత అందులో అరటిపళ్ళు గుండ్రంగా తరిగి పాలల్లో వేసుకోవలెను .
  3. మరుగు వచ్చాక సిమ్ లో పెట్టాలి
  4. 5నిమిషాల వరకు మరిగకా అరటి పండు బాగా కలుపుతూ మెదుపు కోవాలి
  5. ఆ టైం లో పాలు విరుగుతాయి అయిన పర్వాలేదు.
  6. మెదిపిన తరువాత పంచదార వేసి బాగా కలపాలి
  7. పంచదార కరిగేవరకు మరగనివ్వాలి
  8. ఇప్పుడు ఇందులో యాలుకల పొడి మరియు చారోలి వేసి కలపాలి
  9. చల్లారేక యింకా గట్టిపడుతుంది కాబట్టి గారిట జారుగా అయితే చాలు . స్టవ్ ఆపేసి దించేయటమే.
  10. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ గా అయ్యాక తింటే చాలా రుచిగా ఉంటుంది.
  11. అంతే ఎంతో సింపుల్ గా తయారయిపోతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర