హోమ్ / వంటకాలు / పెసర పప్పు తో హల్వా

Photo of Moong daal ka halwa  by Shobha.. Vrudhulla at BetterButter
622
3
0.0(0)
0

పెసర పప్పు తో హల్వా

Nov-19-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పప్పు తో హల్వా రెసిపీ గురించి

పప్పులు వల్ల శరీరానికి ప్రోటీన్స్ చాలా లభ్యమవుతాయి .ఈ హల్వా ఉత్తర భారతదేశములో చాలా ప్రసిద్ధమయిన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఉత్తర భారతీయ
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పెసరపప్పు ఒక కప్పు
  2. పంచదార కప్పున్నర
  3. రవ్వ 2 చంచాలు
  4. శనగపిండి రెండు చంచాలు
  5. నెయ్యి పెద్ద కప్పుడు
  6. యాలుకుల పొడి ఒక చెంచా
  7. కాజు, కిస్మిస్ , బాదం , పిస్తా అన్ని కలిపి అర కప్పు
  8. కేసరి చిటికెడు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు ని 3 ఘంటలు నానబెట్టాలి
  2. 3 గంటలు అయ్యాక మెత్తగా రుబ్బుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నెయ్య వేసుకోవాలి
  4. నెయ్యి వేడెక్కేక సన్నని సెగ మీద గోధుమ నూక మరియు శనగ పిండి వేసి నేతిలో రంగు మార కుండా కమ్మని వాసన వచ్చేదాకా వేయించాలి
  5. వేగాక అందులో రుబ్బి ఉంచిన పెసరపప్పు ముద్ద ని వేసుకొని కలుపుతూ సిం లో వేయించుకోవాలి
  6. ఇప్పుడు మరో పక్క స్టవ్ మీద గిన్నె పెట్టి కప్పుడు నీళ్లు పోసి అందులో కప్పున్నర పంచదార వేసి కరిగే దాకా తిప్పుతూ ఉండాలి
  7. పాకం మారుగుతుండగా అందులో యాలుకల పొడి మరియు కేసరి వేస్తే మంచి రంగు వస్తుంది. పాకం వల్ల హల్వా కూడా మంచి రంగులో ఉంటుంది.
  8. పప్పు ముద్దని బాగా కలుపుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  9. అవసరమయితే మరికొంచెం నెయ్య వేయవచ్చు
  10. పాకం బాగమరిగి లేత పాకం వచ్చాక పొయ్యి కట్టేయండి
  11. ముద్ద రంగు మారాక మరిగి ఉంచిన పాకాన్ని ఈ ముద్దలో మెల్లిగా పోయాలి
  12. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి
  13. ఇప్పుడు పాకాన్ని పీల్చి నెయ్య వొదిలేదాక మెల్లగా కలుపుతూ ఉండాలి
  14. ఇప్పుడు ఇందులో తయారుగా ఉంచిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి
  15. బాగా దగ్గరపడి రంగు కూడా మారి నెయ్య టెలి వరకు ఉడికించుకొని దించుకోండి .
  16. అంతే ఎంతో వేగంగా తయారయ్యే రుచికరమయిన పెసరపప్పు హల్వా రెడి.
  17. వేడి వేడి గా తింటే ఆహా ఎంతో రుచిగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర