హోమ్ / వంటకాలు / ఎండు కొబ్బరి కోరుతో బర్ఫీ

Photo of Dry coconut barfi  by Shobha.. Vrudhulla at BetterButter
441
4
0.0(0)
0

ఎండు కొబ్బరి కోరుతో బర్ఫీ

Nov-19-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎండు కొబ్బరి కోరుతో బర్ఫీ రెసిపీ గురించి

కొబ్బరి వంటికి చలవ చేస్తుంది..కొబ్బరితో చేసే ఏ వస్తువాయిన పిల్లలకి నచుతుంది పెద్దలకు కూడా నచుతుంది.యి బర్ఫీ చాలా రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • మహారాష్ట్ర
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. ఎండు కొబ్బరి కోరు 2 కప్పులు
  2. పంచదార కప్పున్నర
  3. యాలుకల పొడి 1 చంచ
  4. పిస్తా 3 చంచాలు
  5. పచ్చ కర్పూరం చిటికెడు
  6. నెయ్యి 1 కప్పుడు

సూచనలు

  1. ముందుగా కొబ్బరి కొంచెం నెయ్య వేసి వేయించాలి. నెయ్యలో వెయిస్తే కొబ్బరి మంచి సువాసన వస్తుంది.
  2. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి పంచదార వేసి అర గ్లాస్ నీళ్లు పోసి పంచదార కరిగే దాకా కలుపుతూ ఉండాలి
  3. తరువాత స్టవ్ ని మీడియం చేసి ఉండ పాకం వచ్చే వరకు మరగ నివ్వాలి
  4. ఇప్పుడు మరుగుతున్న పాకంలో పచ్చ కర్పూరం , యాలుకల పొడి వేసి కలపాలి
  5. పిస్తా ఒక చంచాడు తీసుకొని దాన్ని కాస్త దంచి పొడి లా చేసి ఈ పాకం లో వేయాలి
  6. యిలా వేయటం వల్ల బర్ఫీ మరి తెల్లగా కాకుండా కాస్త కలర్ మారి లైట్ గ్రీనిష్ కలర్ లో ఉంటుంది..
  7. ఇప్పుడు పాకం లో అన్నివేసి సగం పిస్తా పప్పు కూడా వేసి కలపాలి
  8. అన్ని వేసాక కొబ్బరి కోరు కూడా వేసి బాగా కలపాలి
  9. ఇది మరుగుతున్నప్పుడు కాస్త నెయ్య కూడా వేస్తె యింకా బాగుంటుంది
  10. అన్ని వేసి స్టవ్ ని సిం లో పెట్టి బాగా కలపాలి
  11. దగ్గర పడుతున్నప్పుడు నురుగులాగా వస్తుంది మీదకి పక్కల నుంచి
  12. యిలోపు ఒక కాంచములో నెయ్యి రాసి ఉంచుకోవాలి యి ముద్దని వేయటానికి
  13. కోబ్బరి కోరుని చిన్న ఉండలా చేసి చూసుకోవాలి అయ్యిందో లేదో తెలియటానికి
  14. ఉండాలి అయి గట్టిపడితే అయినట్టే
  15. దాన్ని తీసి నెయ్య రాసి ఉంచిన కంచం లో పోసి వేగంగా నేర్పాలి
  16. ఇప్పుడు దీనిమీద మరికొంచెం మిగిలిన పిస్తా పప్పుని వేయాలి
  17. చల్లారాక నచ్చిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి
  18. అంతే ఎంతో రుచికరమైన ఎండుకొబ్బరి తో బర్ఫీ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర