హోమ్ / వంటకాలు / అటుకులతో చుడువా

Photo of thin poha chivda by Shobha.. Vrudhulla at BetterButter
0
1
0(0)
0

అటుకులతో చుడువా

Nov-21-2018
Shobha.. Vrudhulla
40 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకులతో చుడువా రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది.మహారాష్ట్ర లో యి మిక్సర్ ప్రసిద్ధి.ఎన్నో రాకాలు కలుపుతారు కాబట్టి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • దీపావళి
 • మహారాష్ట్ర
 • వేయించేవి
 • చిరు తిండి
 • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

 1. అటుకులు అర కేజీ
 2. సనగపలుకులు ఒక కప్పు
 3. పుట్నాల పప్పు ఒక కప్పు
 4. ఎండు కొబ్బరి ముక్కలు అర కప్పుడు
 5. ఉప్పు తగినంత
 6. కారము 3 చంచాలు లేక తగినంత
 7. పసుపు ఒక చెంచా
 8. కరివేపాకు ఒక కప్పుడు
 9. పచ్చి మిరపకాయలు 5
 10. ఉల్లిపాయలు 2
 11. సోంపు ఒక చెంచా
 12. చివడా మసాలా 2 చంచాలు ( మార్కెట్ లో లభిస్తుంది)
 13. నూనె ఒక పెద్ద కప్పుడు
 14. మురమురాలు ఒక కప్పుడు

సూచనలు

 1. ముందుగా అటుకులని ఒక రోజంతా ఎండపెట్టాలి
 2. ఉల్లిపాయలు కూడా బాగా సన్నగా తరిగి ఎండలో పెట్టాలి.ఎండటం వల్ల నీరు పోయి గట్టిపడుతుంది
 3. తరువాత పోహని జల్లించాలి.
 4. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి వెడల్పయిన మూకుడు పెట్టి వేడెక్కనివ్వాలి
 5. వేడెక్కాక అందులో పోహ వేసి సింలో బాగా కలుపుతూ వేయించాలి
 6. లేకపోతే సరిగా వేగాక తినేటప్పుడు పళ్ళ మధ్యలో అంటుకుంటూ ఉంటాయి
 7. వేగటానికి కనీసం 25 నిమిషాలయిన పడుతుంది. వేగాయో లేదో తెలియ టానికి కొన్ని తిని చూడండి అంటుకోకుండా ఉండ వేగినట్టే ఆ తరువుకాట దించి పక్కన పెట్టుకోండి
 8. ఇప్పుడు స్టవ్ మీద మరో మూకుడు పెట్టి అందులో నూనె 3 లేక 4 కప్పుల వరకు వేసి వేడెక్క నివ్వాలి
 9. వేడయ్యాక పలుకులు వేసి వేగాక డీపీఫ్రై చేయాలి అవి తీసి పోహలో వేయాలి
 10. అలానే పుట్నాల పప్పు కూడా వేయించి తీసి వేసుకోవాలి
 11. ఉల్లిపాయలు కూడా వేయించాలి కానీ సిం లో పెట్టి బాగా crispy గా వేగాక పోహలో వేయాలి
 12. అన్ని ఒక్కసారి వేసి వేయించి కూడదు
 13. పచ్చి మిర్చి కి నిలువుగా గాట్లు పెట్టి నూనెలో వేయించి తీసి పోహలో వేయాలి
 14. అదే విధంగా కొబ్బరి ముక్కలు కూడా సింలోపెట్టి వేయించి తీసి పోహలో కలప వకేను
 15. మురమురాలు కూడా వేయించి వేయాలి
 16. కరివేపాకు కూడా బాగా కరకరా వేయించి పోహలో కలపాలి
 17. ఇప్పుడు అదే నూనెలో సీమలో పెట్టాలి స్టవ్ కి సోంపు వేసి వేగాక అందులోనే ఉప్పు పసుపు కారము కూడా వేసి 1 నిమిషం ఉంచి పోహలో నూనెతో పాటు కలప వలెను
 18. ఇప్పుడు పోహకి బాగా కిందా మీదా కలపాలి అంత కలిసే వరకు
 19. అంత కలిసాక అన్ని సరిపోయాయా లేదా అని చూసుకొని టేస్ట్ చూడాలి
 20. అంతే ఎంతో రుచికరమయిన పోహ మిక్సర్ (chivda) రెడి తినటానికి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర