ఉల్లి పకోడీ | Ulli pakodi Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  21st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ulli pakodi recipe in Telugu,ఉల్లి పకోడీ, Anitha Rani
ఉల్లి పకోడీby Anitha Rani
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

ఉల్లి పకోడీ వంటకం

ఉల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ulli pakodi Recipe in Telugu )

  • శనగ పిండి 250 గ్రా
  • బియ్యపు పిండి 50గ్రా
  • పచ్చి మిర్చి8
  • ఉల్లిపాయలు 6
  • అల్లము చిన్న ముక్క
  • బేకింగ్ షోడా చిటికెడు
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు,కొత్తిమీర
  • నూనె సరిపడా

ఉల్లి పకోడీ | How to make Ulli pakodi Recipe in Telugu

  1. బేసిన్ తీసుకొని అందులో శనగ పిండి,బియ్యపు పిండి,ఉప్పు,పచ్చి మిర్చి, అల్లము ముద్ద,బేకింగ్ షోడా ,ఉల్లిపాయ ముక్కలు అని వేసి బాగా కలపాలి.
  2. స్టవ్ పైన పాన్ పెట్టి అందులో పకోడీ మునిగే వరకు నూనె పోసి వేడి చెయ్యాలి.
  3. నూనె వేడి అయ్యాక అందులో 2స్పూన్స్ నూనె పిండి మిశ్రమములో వేసి కలపాలి.
  4. కొద్దిగా నీరు వేస్తూ పిండి కలుపుకోవాలి.
  5. బాగా కలిపిన పిండిని చేతికి కొద్దిగా తీసుకొని నూనె లోకి వేసుకొని,రెండు వైపులా వేపుకోవాలి.
  6. చిల్లులు గరిట తో తీసి టిస్యూ పేపర్ మీద వేసుకోవాలి.
  7. వేడి వేడి గా సర్వ్ చేసుకొంటే ఉల్లి పకోడీ ,సాస్,ఎర్ర చిట్న్నీ అద్దుకొని తింటే రుచిగా ఉంటాయి.

నా చిట్కా:

బియ్యపు పిండి వేయడము వలన పకోడీ క్రిప్సీ గా ఉంటాయి.

Reviews for Ulli pakodi Recipe in Telugu (0)