హోమ్ / వంటకాలు / ఉల్లి పకోడీ

Photo of Ulli pakodi by Anitha Rani at BetterButter
721
1
0.0(0)
0

ఉల్లి పకోడీ

Nov-21-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి పకోడీ రెసిపీ గురించి

పండుగ రోజుల్లో,మన ఇంటికి స్నేహితులు వచ్చినప్పుడు,వర్షము వచ్చినప్పుడు,సాయంత్రము పిల్లలకు పెద్దవారికి అందరికి నచ్చిన మెచ్చిన ఉల్లి పకోడీ.శనగపిండి,ఉల్లిపాయముక్కలు కలిపి చేసే పకోడీలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. శనగ పిండి 250 గ్రా
  2. బియ్యపు పిండి 50గ్రా
  3. పచ్చి మిర్చి8
  4. ఉల్లిపాయలు 6
  5. అల్లము చిన్న ముక్క
  6. బేకింగ్ షోడా చిటికెడు
  7. ఉప్పు తగినంత
  8. కరివేపాకు,కొత్తిమీర
  9. నూనె సరిపడా

సూచనలు

  1. బేసిన్ తీసుకొని అందులో శనగ పిండి,బియ్యపు పిండి,ఉప్పు,పచ్చి మిర్చి, అల్లము ముద్ద,బేకింగ్ షోడా ,ఉల్లిపాయ ముక్కలు అని వేసి బాగా కలపాలి.
  2. స్టవ్ పైన పాన్ పెట్టి అందులో పకోడీ మునిగే వరకు నూనె పోసి వేడి చెయ్యాలి.
  3. నూనె వేడి అయ్యాక అందులో 2స్పూన్స్ నూనె పిండి మిశ్రమములో వేసి కలపాలి.
  4. కొద్దిగా నీరు వేస్తూ పిండి కలుపుకోవాలి.
  5. బాగా కలిపిన పిండిని చేతికి కొద్దిగా తీసుకొని నూనె లోకి వేసుకొని,రెండు వైపులా వేపుకోవాలి.
  6. చిల్లులు గరిట తో తీసి టిస్యూ పేపర్ మీద వేసుకోవాలి.
  7. వేడి వేడి గా సర్వ్ చేసుకొంటే ఉల్లి పకోడీ ,సాస్,ఎర్ర చిట్న్నీ అద్దుకొని తింటే రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర