చేగోడీలు | Chegodilu/rings Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  21st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Chegodilu/rings by Shobha.. Vrudhulla at BetterButter
చేగోడీలుby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

4

0

చేగోడీలు వంటకం

చేగోడీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chegodilu/rings Recipe in Telugu )

 • వరిపిండి 1 గ్లాస్
 • పెసరపప్పు 3 చంచాలు
 • ఉప్పు తగినంత
 • కారము 4చంచాలు
 • జీలకర్ర 2చంచాలు
 • ఇంగువ అర చంచ
 • నూనె అర లీటరు

చేగోడీలు | How to make Chegodilu/rings Recipe in Telugu

 1. ముందుగా స్టవ్ మీద గిన్నీ పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లు పోయాలి
 2. అవి మరుగు పెట్టగానే పెసరపప్పు వేయాలి
 3. పప్పు బాగా మెత్తగా ఉడకనివ్వాలి
 4. బాగా మెత్తగా ఉడికిన తరువాత ఇందులో ఊపు,కారము,జీలకర్ర,ఇంగువ వేసి మరో 2 నిమిషాలు మరిగించాలి
 5. ఆ మరిగిన నీళ్ళల్లో వరిపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి
 6. ఇప్పుడు స్టవ్ ఆర్పీ ముద్దని కిందకు దించి అందులో 1 కప్పుడు నూనె వేసి కాస్త అటు ఇటు కలిపి 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి
 7. 5నిమిషాల తరువాత ఆ ముద్దని బాగా రేండ్లు చేతులతో కూడా మర్దన చేస్తూ కలపాలి
 8. ఇప్పుడు ఆ ముద్ద ని చిన్న చిన్న ఉండలుగా తీసి పీటమీద వత్తాలి
 9. వత్తి న పిండిని గుండ్రంగా తిప్పుతూ చేగొడిల్లా చేసుకోవాలి
 10. అన్ని అయ్యాక మూకుడు స్టవ్ మీదపెట్టి నూనె వేసి వేడెక్కక అందులో చేగోడీలు వేసి చక్కగా వేయించి తీసుకోవాలి
 11. అంతే ఎంతో రుచికరమయిన చేగోడీలు తయారు

నా చిట్కా:

ఇందులో కావలసిన వాళ్ళు నచ్చితే నువ్వులపప్పు కూడా వేసుకోవచ్చును

Reviews for Chegodilu/rings Recipe in Telugu (0)