హోమ్ / వంటకాలు / చేగోడీలు

Photo of Chegodilu/rings by Shobha.. Vrudhulla at BetterButter
1736
4
0.0(0)
0

చేగోడీలు

Nov-21-2018
Shobha.. Vrudhulla
20 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేగోడీలు రెసిపీ గురించి

చాలా పాత కాలం వంట.ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రసిద్ధమయినది ఇది .పిల్లలకి పెద్దలకు నచ్చేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

  1. వరిపిండి 1 గ్లాస్
  2. పెసరపప్పు 3 చంచాలు
  3. ఉప్పు తగినంత
  4. కారము 4చంచాలు
  5. జీలకర్ర 2చంచాలు
  6. ఇంగువ అర చంచ
  7. నూనె అర లీటరు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద గిన్నీ పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లు పోయాలి
  2. అవి మరుగు పెట్టగానే పెసరపప్పు వేయాలి
  3. పప్పు బాగా మెత్తగా ఉడకనివ్వాలి
  4. బాగా మెత్తగా ఉడికిన తరువాత ఇందులో ఊపు,కారము,జీలకర్ర,ఇంగువ వేసి మరో 2 నిమిషాలు మరిగించాలి
  5. ఆ మరిగిన నీళ్ళల్లో వరిపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆర్పీ ముద్దని కిందకు దించి అందులో 1 కప్పుడు నూనె వేసి కాస్త అటు ఇటు కలిపి 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి
  7. 5నిమిషాల తరువాత ఆ ముద్దని బాగా రేండ్లు చేతులతో కూడా మర్దన చేస్తూ కలపాలి
  8. ఇప్పుడు ఆ ముద్ద ని చిన్న చిన్న ఉండలుగా తీసి పీటమీద వత్తాలి
  9. వత్తి న పిండిని గుండ్రంగా తిప్పుతూ చేగొడిల్లా చేసుకోవాలి
  10. అన్ని అయ్యాక మూకుడు స్టవ్ మీదపెట్టి నూనె వేసి వేడెక్కక అందులో చేగోడీలు వేసి చక్కగా వేయించి తీసుకోవాలి
  11. అంతే ఎంతో రుచికరమయిన చేగోడీలు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర