హోమ్ / వంటకాలు / అరటిపండు మాల్పువ(గోధుమ పిండి తో)

Photo of banana  malpua  by Pravallika Srinivas at BetterButter
450
3
0.0(0)
0

అరటిపండు మాల్పువ(గోధుమ పిండి తో)

Nov-21-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటిపండు మాల్పువ(గోధుమ పిండి తో) రెసిపీ గురించి

ఈ వంటకం చాలా తేలిక రుచి అమోఘం.మాములు మాల్పువ లో మైదా వాడతారు అందుకు బదులుగా గోధుమ పిండి వేసి చేసాను.మగ్గిన అరటిపండు వేయడం వలన మంచి రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • మిళితం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి - 1 కప్పు
  2. బేకింగ్ పౌడర్ - 1/4 స్పూను
  3. బేకింగ్ సోడా - చిటికెడు
  4. మగ్గిన అరటిపండు - 1
  5. కాచి చల్లార్చిన పాలు - తగినంత
  6. పంచదార - 1 కప్పు
  7. నీరు - తగినంత
  8. నూనె / నెయ్యి - తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక బేసిన్ లో గోధుమ పిండి వేసి బేకింగ్ సోడా ,బేకింగ్ పౌడర్, మగ్గిన అరటిపండు వేసి కలుపుకోవాలి.
  2. పైనుండి పాలు పోసి మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  3. ఈ పిండిని జారుగా దోశ పిండి మాదిరి ఉండాలి.
  4. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  5. ఈలోగా ఒక గిన్నెలో పంచదార తగినాన్ని నీరు వేసి తీగ పాకం రానివ్వాలి.
  6. యాలుకలు దంచి మారుగుతున్న పాకంలో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
  7. ఇప్పుడు కళాయిలో నూనె నెయ్యి డీప్ఫ్రై కన్నా తక్కువ వేసి వేడి చేసి గారిట జారుగా ఉన్న పిండిని పోసుకోవాలి.
  8. అది కొంచం లైట్ గోల్డెన్ బ్రౌన్ లోకి రాగానే మరొకవైపు తిప్పుకోవాలి.
  9. రెండోవైపు కూడా కాలిన తర్వాతే నూనె లో నుండి తీసేసి వేడి పాకం లో ముంచి 2 నిమిషాలు ఉంచి ప్లేట్ లోకి తీస్కోవాలి.
  10. ఇలాగే అన్ని పిండి అంత అయ్యేవరకు తయారు చేసుకోవాలి
  11. తయారైన వాటిని సెర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన డ్రై ఫ్రూయిట్స్ పొడి మరియు పిస్తా పలుకులు వేసుకోవాలి.
  12. అంతే యంతో రుచికరమైన గోధుమపిండి బననా మలుపువాలు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర