హోమ్ / వంటకాలు / డ్రైఫ్రూయిట్స్ కజ్జికాయలు బాతుల ఆకారంలో

Photo of Duck shaped dryfruits gujiya by Pravallika Srinivas at BetterButter
0
4
0(0)
0

డ్రైఫ్రూయిట్స్ కజ్జికాయలు బాతుల ఆకారంలో

Nov-21-2018
Pravallika Srinivas
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రైఫ్రూయిట్స్ కజ్జికాయలు బాతుల ఆకారంలో రెసిపీ గురించి

డ్రైఫ్రూయిట్స్ కజ్జికాయలు బాతుల ఆకారంలో చేయడం కొంచం కష్టమైన పిల్లల కోసమ్ ఇష్టంగా చేస్తే వాళ్ళు ఇష్టం గా తింటారు.ఎప్పుడు రోటీనేగా కజ్జికాయలు చెక్కతో కాకుండా ఇలా ట్ర్య్ చేస్తే చూడటానికి తినడానికి చాలా బాగుంటాయి.ఇందులో వాడిన డ్రైఫ్రైయిట్స్ అన్ని చాలా బలమైన పదార్ధాలు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పండుగలాగా
 • భారతీయ
 • నూనె లేకుండ వేయించటం
 • చిన్న మంట పై ఉడికించటం
 • వేయించేవి
 • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. మైదా - 200 గ్రాములు
 2. నెయ్యి - 1 స్పూను
 3. ఉప్పు - చిటికెడు
 4. నీరు - తగినంత
 5. జీడిపప్పు
 6. బాదం పప్పు
 7. వాల్నట్స్
 8. పల్లీలు
 9. బెల్లం
 10. ఎండు ద్రాక్ష
 11. కజ్జురం
 12. యాలుకలపొడి
 13. నూనె - తగినంత

సూచనలు

 1. ముందుగా మైదా పిండి లో చిటికెడు ఉప్పు వేసి నెయ్యి వేసి కలుపుకోవాలి.
 2. పైన తగినన్నీ నీరు వేసి కలుపుకుని పూరిపిండిలాగా గట్టిగా కలుపుకోవాలి.
 3. మూత పెట్టి ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి.
 4. ఈలోగా డ్రైఫ్రూయిట్స్ అన్నింటిని కళాయిలో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి.
 5. చల్లారిన తర్వాత యందు ద్రాక్ష,కజ్జురం,బెల్లం వేసి కొంచం కర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.
 6. ఇప్పుడు తయారయిన మైదా ముద్దని మర్దన చేసి సగం పెద్ద ఉండలు,సగం చిన్న ఉండలు చేస్కోవాలి.
 7. పెద్ద ఉండలు బాతు కిందభాగనికి ,చిన్న ఉండలు తల ముక్కు భాగానికి అన్నమాట.
 8. పెద్ద ఉండని తీసుకుని రౌండుగా వత్తుకుని మధ్యలో డ్రైఫ్రూయిట్స్ మిశ్రమం వేసి చివర్లు మైదా పేస్ట్ రాసుకోవాలి.
 9. సగానికి మడిచి చివర్లు కజ్జికాయలు చుట్టినట్టుగా చుట్టాలి.
 10. ఇప్పుడు చివర్లు మడిస్తే బాతు కింది భాగం అయినట్టు.
 11. ఇపుడు చిన్న ఉండని రౌండ్గా వత్తుకుని మధ్యలో డ్రైఫ్రూట్స్ పిండి స్టఫ్ చేసి మొదకలాగా చుట్టుకుని చివర్లు కలిపి ముక్కులాగా చేసుకోవాలి.
 12. తలభాగం రెడీ అయినట్టు.ఒకసారి సైజ్ సరిపోతుందో లేదో చూసుకోండి.
 13. ఇప్పుడు ఒక యాలుక తీసుకుని వాటి గింజలు తీసి బాతుకళ్ళు లాగా అమార్చుకోవాలి.
 14. అవి నిలవవు కనుక ఒకసారి మైదా పేస్ట్ లో ముంచి అతికిస్తే వేయించేతప్పుడు కూడా ఊడిపోవు.
 15. ఇప్పుడు బాతు తలభాగంని కిందభాగంని మైదా పేస్ట్ రాసి అతికించుకోవాలి.
 16. ఇప్పుడు కదాయిలో నూనె వేసి మీడియం హీట్ అయ్యాక బాతు కజ్జికాయలు జాగ్రత్తగా వదిలి డీప్ఫ్రై చేసుకోవాలి.గంటతో పైనుండి నూనె వేసుకోవాలి.పూర్తిగా ముంచితే షేప్ చెడిపోతుంది.
 17. మీడియం కలర్ లోకి వచ్చాక జాగ్రత్తగా నూనె నుండి తీసుకుని ప్లేట్ లో వేసుకోవాలి.
 18. అంతే బాతు ఆకారం డ్రైఫ్రూయిట్స్ కజ్జికాయలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర