హోమ్ / వంటకాలు / దద్ధోజనం

Photo of Curd rice by Sitamraju Kalyani at BetterButter
1409
2
0.0(0)
0

దద్ధోజనం

Nov-22-2018
Sitamraju Kalyani
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దద్ధోజనం రెసిపీ గురించి

మెత్తగా ఉడికించిన అన్నం లో పెరుగు కలిపి పోపు వేయటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. బియ్యం - అరకప్పు
  2. నీళ్లు - ఒకటిన్నర కప్పులు
  3. పెరుగు - ఒక కప్పు
  4. పాలు - పావు కప్పు
  5. పచ్చిమిర్చి(సన్నగా తరిగి) - రెండు
  6. అల్లం (సన్నగా తరిగి)- ఒకటిన్నర టీస్పూన్‌
  7. ఆవాలు - ముప్పావు టీస్పూన్‌
  8. పచ్చి శెనగపప్పు - ముప్పావు టీస్పూన్‌
  9. మినపప్పు - అర టీస్పూన్‌
  10. కరివేపాకులు - కొన్ని
  11. ఇంగువ - చిటికెడు
  12. నూనె - రెండు టీస్పూన్లు
  13. ఎండుమిర్చి - రెండు

సూచనలు

  1. బియ్యం శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి.
  2. అన్నాన్ని గరిటెతో కొద్దిగా మెత్తగా చేయాలి. అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు పోసి కలిపి చల్లారనివ్వాలి. తరువాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
  3. పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, పచ్చి శెనగపప్పు, మినపప్పు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొన్ని సెకన్లు వేగించాలి.
  4. ఈ తాలింపును పెరుగన్నంలో వేసి కలపాలి కొత్తిమీర తో అలంకరించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర