హోమ్ / వంటకాలు / బూందీ తొక్కుడులడ్డు

Photo of Pounded boondi laddoo by Kavitha Perumareddy at BetterButter
631
3
0.0(0)
0

బూందీ తొక్కుడులడ్డు

Nov-22-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూందీ తొక్కుడులడ్డు రెసిపీ గురించి

మాములుగా తొక్కుడులడ్డు జంతికలను మెత్తగా పొడి చేసి పాకం పట్టి చేస్తారు.ఇక్కడ నేను బూందీ ని పొడిచేసి చేసాను.చాలా బాగుంది రుచి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. శనగపిండి 250 గ్రామ్స్
  2. చెక్కర 350 గ్రామ్స్
  3. నెయ్యి 3 స్పూన్స్
  4. జీడిపప్పు 20 గ్రామ్స్
  5. ద్రాక్ష 20 గ్రామ్స్
  6. యాలకులపొడి స్పున్
  7. నూనె డీప్ ప్రై కు సరిపడా
  8. సోడాపోడి పావు స్పున్

సూచనలు

  1. ముందుగా శనగపిండి లో సోడాపోడి తగినంత నీళ్లు పోసి దోసెపిండిలా కలిపి పెట్టుకోవాలి.
  2. తరువాత పోయిమీద బాండిపెట్టి తగినంత నూనె వేసి కాగనివ్వాలి.కాగినతరువత బూందీ గరిట తీసుకొని బాండీ పైన పెట్టి పిండివేసి గరిటతో తిప్పుతూ ఉంటే పిండి చుక్కలుగా పడి బూందీ తయారవుతుంది.
  3. బూందీ మరీ గట్టిగా కాకుండా ...మెత్తగా కాకుండా మీడియంగా కొద్దిగా కలర్ వచ్చేవరకు వేయించాలి.
  4. తరువాత బూందీని మిక్షిలో వేసి పొడి చేసుకోవాలి.ఒక గిన్నెలో వేసుకోవాలి.
  5. ఇప్పుడు పోయిమీద గిన్నె పెట్టి చెక్కర,సగం గ్లాస్ నీరు పోసి కాగనివ్వాలి.తీగపాకం రానివ్వాలి .మరీ ముదురుపాకం వద్దు.పాకాన్ని పొడిలో వేసుకోవాలి.నేతిలో వేయించిన జీడిపప్పు, ద్రాక్ష,నేతితో సహా పొడిలో వేసుకోవాలి.యాలకులపొడి కూడా వేసుకోవాలి.
  6. అంతా బాగా కలుపుకొని 15 నిముషాలు పక్కనపెట్టుకోవాలి. చల్లారనివ్వాలి. అప్పుడు మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలపాలి.మర్దనచేయాలి.అప్పుడు మెత్తగా అవుతుంది.తరువాత లడ్డులు చుట్టుకోవాలి.అంతే బూందీ తొక్కుడులడ్డు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర