హోమ్ / వంటకాలు / మసాలా ఉండ్రాళ్ళు

Photo of Masala undrallu by Swetha Vijayagiri at BetterButter
481
4
0.0(0)
0

మసాలా ఉండ్రాళ్ళు

Nov-23-2018
Swetha Vijayagiri
40 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా ఉండ్రాళ్ళు రెసిపీ గురించి

వినాయకుడికి ఇష్టమైనవి,చాలా తేలికగా తొందరగా చేసుకోవచ్చు, కాస్త కొత్తగా ట్రయ్ చేసాను

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పండుగలాగా
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి: 1 కప్
  2. పల్లి పౌడర్: 1/4 కప్
  3. ఉప్పు: సరిపడా
  4. కారం: 1/2 స్పూన్
  5. పసుపు: 1/4 స్పూన్
  6. ఉల్లిపాయ: 1
  7. మిర్చి: 3
  8. వెల్లుల్లి తరుగు: 2 స్పూన్స్
  9. దనియా పౌడర్: 1/2 స్పూన్
  10. ఆయిల్: 2 స్పూన్స్
  11. చాట్ మసాలా: 1 స్పూన్
  12. గరం మసాలా: 1/4 స్పూన్
  13. జీలకర్ర,ఆవాలు: 1 స్పూన్
  14. కరివేపాకు: 2 రెమ్మలు
  15. కొత్తిమీర తరుగు : 2స్పూన్స్

సూచనలు

  1. ముందుగా గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి చిటికెడు ఉప్పు వేసి వేడి చెయ్యాలి
  2. నీళ్లు వేడి అయ్యాక బియ్యం పిండి వేసి కలిపి పక్కన పెట్టికోవాలి
  3. పిండి చల్లబడిన తర్వాత ప్లేట్ లో కి తీసుకొని చపాతీ పిండిలా సాఫ్ట్ గా కలుపుకోవాలి
  4. ఇప్పుడు పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  5. అన్ని చేసుకున్నాక ఆవిరి మీద 20 నిమిషాలు ఉడికించుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద కడయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర,ఆవాలు,ఉల్లిపాయలు, మిర్చి,వెల్లుల్లి తరుగు,కరివేపాకు వేసి వేయించుకోవాలి
  7. ఇందులో పసుపు,కారం,ఉప్పు,దనియా పౌడర్ వేసి కలిపి ఉండ్రాళ్ళు వేసి 2 నిమిషాలు ఫ్రై చెయ్యాలి
  8. ఇప్పుడు పల్లి పౌడర్, చాట్ మసాలా,గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  9. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర