హోమ్ / వంటకాలు / గుజియా

Photo of Dryfruit Gujiya by Pranali Deshmukh at BetterButter
572
2
0.0(0)
0

గుజియా

Nov-23-2018
Pranali Deshmukh
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుజియా రెసిపీ గురించి

డ్రై ఫ్రూట్ కజ్జికాయలు  కజ్జికాయలు అన్ని పండుగ సందర్భాలలో చేసుకోవాచ్చు. ముఖ్యంగా వీటిని దీపావళికి  చేస్తారు. ఈ కజ్జికాయలలో డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాము కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.  ఇందులో చెక్కర వాడము కాబట్టి వీటిని షుగర్ వ్యాది ఉన్నవారు కూడా తినవచ్చును.  పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్ లాగా వీటిని చేసి పట్టవచ్చును. ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్  కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 200 గ్రా. పల్లీలు
  2. 400 గ్రా. ఎండుకొబ్బిరి1
  3. 1 టీ స్పూన్ యాలకులపొడ
  4. 300 గ్రా పుట్నాలుపప్పు
  5. తగినంత నూనె
  6. కొద్దిగ ఉప్పు
  7. 200 గ్రా. కిస్ మిస్
  8. 200 గ్రా. జీడిపప్పు
  9. 1 కేజీ మైదాపిండి
  10. 600 గ్రా ఎండు ఖర్జూరాలు

సూచనలు

  1. మైదాపిండిలో కొద్దిగా ఉప్పు కలిపి రెండు టేబుల్‌స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు కలిపి ముద్దలా చేయాలి.
  2. ఎండు ఖర్జూరాల్ని దంచి అందులోని గింజల్ని తీసేసి తరువాత ఖర్జూరాల్ని మిక్సీలో వేసి కాస్త కచ్చాపచ్చాగా చేయాలి. వేరుసెనగపప్పును వేయించాలి. వీటిని జీడిపప్పు, శనగపప్పుతో కలిపి పొడి చేయాలి. ఈ పొడిలోనే కిస్‌మిస్‌, యాలకులపొడి, కొబ్బరి తురుము అన్నీ కలపాలి.
  3. ఇప్పుడు మైదాపిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తాలి.
  4. అందులో డ్రైఫ్రూట్‌ మిశ్రమాన్ని పెట్టి రెండువైపులా మూసేసి, కజ్జికాయలా వత్తాలి. ఇప్పుడు వీటిని నాలుగైదు చొప్పున నూనెలో వేయించి తీసేయాలి. వీటిలో పంచదార ఉండదు కాబట్టి, మధుమేహం ఉన్నవారు కూడా చక్కగా తినవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర