హోమ్ / వంటకాలు / ఖజ్జూరం రవ్వ హల్వా(పంచదార లేకుండా)

Photo of Dates and  suji halwa(with out sugar). by Swapna Tirumamidi at BetterButter
522
3
0.0(0)
0

ఖజ్జూరం రవ్వ హల్వా(పంచదార లేకుండా)

Nov-23-2018
Swapna Tirumamidi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖజ్జూరం రవ్వ హల్వా(పంచదార లేకుండా) రెసిపీ గురించి

ఇది డేట్స్ సిరప్ తో చెయ్యడం వల్ల ఆరోగ్యం కరం.రవ్వకేసరి మామూలుగా అందరూ చేసుకుంటాం...ఇది ఇలా చేసాను..రుచి చాలా బాగా వచ్చింది..

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కరాచీ నూక ఒక కప్
  2. డేట్స్ పేస్ట్ 3 స్పూన్స్
  3. డేట్స్ సిరప్ 100 గ్రామ్స్.
  4. డ్రై కొబ్బరి పొడి 2 స్పూన్స్
  5. బెల్లం తురుము 2 టేబుల్ స్పూన్స్(అవసరం అనుకుంటే)
  6. యాలకులపొడి కొద్దిగా
  7. పాలు 2 కప్పులు
  8. జీడిపప్పులు 10...15
  9. నెయ్యి 3 టేబుల్ స్ఫూన్లు

సూచనలు

  1. ముందుగా డేట్స్ ని గింజలు తీసి వేడినీళ్లలో 15 నిమిషాలు నాన పెట్టి ,మెత్తగా మిక్సీ పట్టు కోవాలి.
  2. ఇప్పుడు రవ్వని పొడిగా,కమ్మటి వాసన వచ్చేదాకా వేయించి అందులోనే పాలు,డ్రై కొబ్బరి పొడి ఒక చెంచాడు వేసి ఉడకనివ్వాలి కావాలంటే కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవచ్చు.
  3. రవ్వబాగా ఉడికిన తరువాత డేట్స్ గుజ్జు ,డేట్స్ సిరప్ కూడా వేసి బాగాకలిపి ఒక్కసారి ఉడికించాలి.బాగాకలుపుతూ ఉండాలి వుండకట్టనివ్వకూడదు.
  4. ఇప్పుడు నెయ్యి వేసి బాగాకలిపి,యాలకులపొడి వేసి మళ్ళీ కలిపి ముద్దలా అయ్యేవరకూ ఉంచి దించుకోవాలి.
  5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన మౌల్డ్ లో నెయ్యిరాసి దానిలోకి మార్చుకుని పరుచుకోని చల్లారనివ్వాలి.
  6. ఇప్పుడు కొద్దిగా నేతిలో జీడిపప్పులు వేయించి ఉంచుకోవాలి.
  7. ఇప్పుడు చల్లారిన హాల్వా ని ముక్కలుగా కోసుకుని మిగిలిన కొబ్బరి పొడిలో అన్ని పక్కలా అదిమి జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర