హోమ్ / వంటకాలు / అటుకుల పులిహోర

Photo of Rice flakes pulihora. by Swapna Tirumamidi at BetterButter
564
3
0.0(0)
0

అటుకుల పులిహోర

Nov-23-2018
Swapna Tirumamidi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పులిహోర రెసిపీ గురించి

ఇది చాలా సులభం...టిఫిన్ ,లంచ్,డిన్నర్ ఇలా ఎలా అయినా తినచ్చు...ముఖ్యంగా నైవేధ్యానికి కూడా చేస్తాము.

రెసిపీ ట్యాగ్

  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

  1. అటుకులు అరకేజీ
  2. నిమ్మరసం ఒక కప్
  3. వేరుశెనగ గుళ్ళు గుప్పెడు.
  4. శెనగపప్పు,మినపప్పు, చెరొక స్పూన్
  5. ఆవాలు అర చెంచా
  6. ఇంగువ 2 చిటికెలు
  7. ఉప్పు రుచి తగినంత
  8. పచ్చిమిర్చి,ఎండుమిర్చి 5
  9. కరివేపాకు కొద్దిగా.
  10. పసుపు పావు స్పూన్.
  11. అల్లం ముక్కలు 2 స్పూన్స్.
  12. నూని 4 స్పూన్స్.

సూచనలు

  1. ముందు అరకేజీ అటుకులు సరి పడే మూకుడు పెట్టి నూని వేసి వేరుసెనగగుళ్లు వేసి వేయించాలి.
  2. తరువాత ఆవాలువేసి వేగాక మిగిలిన పప్పులు వేయి వేయించి...ఇప్పుడు ఎండుమిర్చి పచ్చి మిర్చి, కరివేపాకు ఇంగువ...అల్లంముక్కలు వేసి బాగా వేయించాలి.
  3. ఈ పోపు వేగేలోపు అటుకులు కడిగి నీరు తీసి పెట్టుకోవాలి...కడగటం ఎక్కువ సేపు చెయ్యకూడదు...గబగబా కడగాలి...
  4. పోపు బాగా వేగాక పసుపు వేసి, కడిగిన అటుకులు కూడా వేసి బాగాకలిపి నిమ్మరసం,ఉప్పు కలుపుకోవాలి...
  5. అంతే ఎంతో సులువు,ఎంతో రుచి...వ్వాహ్.... అటుకుల పులిహోర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర