ఆనియన్ సమోసా | Onion samosa Recipe in Telugu

ద్వారా sneha gilla  |  24th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Onion samosa by sneha gilla at BetterButter
ఆనియన్ సమోసాby sneha gilla
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

10

0

ఆనియన్ సమోసా వంటకం

ఆనియన్ సమోసా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion samosa Recipe in Telugu )

  • గోధుమ పిండి 1/2 కప్
  • మైదా పిండి 1/2 కప్
  • గోధుమ రవ్వ 1 స్పూన్
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  • శనిగపిండి 2 స్పూన్లు
  • కొత్తిమీర కొద్దిగా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
  • కారం 1 స్పూన్
  • ఉప్పు 1 స్పూన్

ఆనియన్ సమోసా | How to make Onion samosa Recipe in Telugu

  1. ఒక గిన్నెలో గోధుమ పిండి,మైదా మరియు గోధుమ రవ్వ తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టండి.
  2. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 స్పూన్ ల ఆయిల్ వేసుకోవాలి.
  3. ఆయిల్ వేడి అయ్యాక అందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి.
  4. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్,కారం,ఉప్పు వేసి కలపండి.
  5. ఆ తరువాత శనిగపిండి కుడా వేసి 2 నిముషాలు వేయించండి.
  6. చివరిగా కొతిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి.
  7. తర్వాత పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించండి .
  8. ముందుగా తయారుచేసుకున్న పిండిని తీసుకుని చిన్న పూరిగా చేసుకొని దానిని మధ్యలోకి కట్ చేయండి .
  9. సగానికి కట్ చేసిన పూరీని తీసుకుని సమోసా ఆకారంలో చేసి ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ స్టఫ్ ని అందులో పెట్టుకొని మూసివేయండి.
  10. ఆ విదంగా సమోసాలన్నీ సిద్ధం చేసుకొని డీప్ ఫ్రై చేయండి.అంతే వేడి వేడి ఆనియన్ సమోసా రెడీ .

Reviews for Onion samosa Recipe in Telugu (0)