హోమ్ / వంటకాలు / ఆనియన్ సమోసా

Photo of Onion samosa by sneha gilla at BetterButter
115
7
0.0(0)
1

ఆనియన్ సమోసా

Nov-24-2018
sneha gilla
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ సమోసా రెసిపీ గురించి

ఆనియన్ సమోసా

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • మితముగా వేయించుట
 • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

 1. గోధుమ పిండి 1/2 కప్
 2. మైదా పిండి 1/2 కప్
 3. గోధుమ రవ్వ 1 స్పూన్
 4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
 5. శనిగపిండి 2 స్పూన్లు
 6. కొత్తిమీర కొద్దిగా
 7. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
 8. కారం 1 స్పూన్
 9. ఉప్పు 1 స్పూన్

సూచనలు

 1. ఒక గిన్నెలో గోధుమ పిండి,మైదా మరియు గోధుమ రవ్వ తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టండి.
 2. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 స్పూన్ ల ఆయిల్ వేసుకోవాలి.
 3. ఆయిల్ వేడి అయ్యాక అందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి.
 4. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్,కారం,ఉప్పు వేసి కలపండి.
 5. ఆ తరువాత శనిగపిండి కుడా వేసి 2 నిముషాలు వేయించండి.
 6. చివరిగా కొతిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి.
 7. తర్వాత పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించండి .
 8. ముందుగా తయారుచేసుకున్న పిండిని తీసుకుని చిన్న పూరిగా చేసుకొని దానిని మధ్యలోకి కట్ చేయండి .
 9. సగానికి కట్ చేసిన పూరీని తీసుకుని సమోసా ఆకారంలో చేసి ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ స్టఫ్ ని అందులో పెట్టుకొని మూసివేయండి.
 10. ఆ విదంగా సమోసాలన్నీ సిద్ధం చేసుకొని డీప్ ఫ్రై చేయండి.అంతే వేడి వేడి ఆనియన్ సమోసా రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర