హోమ్ / వంటకాలు / తెల్ల సనగల కోఫ్తా కర్రీ

Photo of Kabuli chana kofta curry by Pasumarthi Poojitha at BetterButter
1143
5
0.0(0)
0

తెల్ల సనగల కోఫ్తా కర్రీ

Nov-25-2018
Pasumarthi Poojitha
3 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తెల్ల సనగల కోఫ్తా కర్రీ రెసిపీ గురించి

కోఫ్తా లు చేసే మిశ్రమం లో శనగపిండి,మైదా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కాబోలి చెన్న 1కప్
  2. ఉల్లిపాయలు 2
  3. టొమాటోస్ 4
  4. మిర్చి 2
  5. కారం 1 టేబుల్ స్పూన్
  6. సాల్ట్ తగినంత
  7. దానియా పొడి 1 టేబుల్ స్పూన్
  8. జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్
  9. పసుపు 1 టేబుల్ స్పూన్
  10. ఆలూ 3
  11. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  12. కొత్తిమీర కొంచం

సూచనలు

  1. ముందుగా కాబోలి చెన్న ని 4 గంటలు నా పెట్టాలి.
  2. నాన పెట్టిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆలూ కూడా సుబ్రన్గా కడిగి రెండు ముక్కలుగా చేసి ఉడికించి పెట్టుకోవాలి.
  3. చనా ని కచ్చ పచ్చ గా మిక్సీ చేసి పెట్టుకోవాలి .కొంచం చెన్న పేస్ట్ పక్కన ఉంచుకోవాలి.అలాగే ఆలూ నే మెతుపుకొని చెన్న లో వేయాలి ,అందులో పచ్చి మిర్చి కట్ చేసి వేయాలి,సాల్ట్ సరిపడా,కొత్తిమీర ,శనగ పిండి ,మైదా వేసి చక్కగా కలుపుకోవాలి.దాన్ని ముద్ద ల చేసుకోవాలి .
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడై పెట్టి నూనె వేసి వేడి అయ్యాక మంట తక్కువగా పెట్టుకొని కొఫ్త్ చేసుకున్న ముద్ద ని కొంచం తీసుకొని రౌండ్ షేప్ చేసుకోని కాగిన నూనె లో వేయాలి అవి గోల్డెన్ కలర్ వచ్చే అంత వరకు వేగనివ్వాలి.వాటిని తీసి పక్కన ఉంచుకోవాలి.
  5. ఇపుడు ఉల్లిపాయలు కట్ చేసినవి తీసుకొని స్టవ్ వెలిగించి కడై పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయేంచాలి 5 మినిట్స్ వరకు అలాగే టొమాటోలు కూడా ముక్కలు కట్ చేసి అదే బాండీ లో వేయేంచాలి టొమాటోస్ మగ్గిన తర్వాత రెండు తీసి పక్కన పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అయే వరకు.
  7. ఒక కడాయి పెట్టుకొని కొంచం ఆయిల్ వేసి పచ్చి మిర్చి ,ఉల్లిపాయ ముక్కలు రెండు కొంచం వేగిన తర్వాత సాల్ట్,కారం,పసుపు,వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ టమాటో పేస్ట్ ని అందులో వేయాలి కొంచం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి
  8. మూత తీసి దానియా,జీరా,పౌడర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు పక్కన తీసి పెట్టుకుని ఉన్న చెన్న మిశ్రమాన్ని వాటర్ పోసి ఆ కూర ని అడజస్ట్ చేసుకోవచ్చు.
  9. ఇప్పుడు ఆ కూర కోఫ్తా లు వేసుకొని కాసేపు అలా ఉంచితే కోఫ్తా దాంట్లో చక్కగా ననుతయే . కొత్తిమీర వేసుకుంటే కొఫ్త్ కర్రీ రెడి. సర్వ్ ను ఈట్ హాట్ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర