హోమ్ / వంటకాలు / ఆలూ 65 రెస్టారెంట్ స్టైల్

Photo of Aloo 65 restaurant style by Tejaswi Yalamanchi at BetterButter
854
8
0.0(0)
0

ఆలూ 65 రెస్టారెంట్ స్టైల్

Nov-26-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ 65 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ గురించి

ఇంట్లోనే తేలికగా రెస్టారెంట్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళాదుంపలు 300 గ్రా.
  2. మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు
  3. మొక్కజొన్న పిండి 3 టేబుల్ స్పూన్లు
  4. నీరు 2 చెంచాలు
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా + 3 టేబుల్ స్పూన్లు కూరకి
  6. తరిగిన వెల్లుల్లి 1 చెంచా
  7. తరిగిన ఉల్లిపాయ 1
  8. తరిగిన పచ్చిమిర్చి 2
  9. ఎండు మిరపకాయలు 2
  10. కర్వేపాకు 1 రెమ్మ
  11. ధనియాలపొడి 1/2 టీస్పూన్
  12. జీలకర్ర పొడి 1/2 టీస్పూన్
  13. గరంమసాలా 1/2 టీస్పూన్
  14. కారం 1/2 టీస్పూన్
  15. ఉప్పు రుచికి సరిపడా
  16. పెరుగు 200 గ్రాములు
  17. నిమ్మరసం 1/2 టీస్పూన్
  18. రెడ్ ఫుడ్ కలర్ తగినంత

సూచనలు

  1. ముందుగా బంగాళదుంపలను ముక్కలుగా చేస్కోండి.
  2. పొయ్యి మీద బాండి పెట్టి నీరు పోసి ఎనభై శాతం ఉడికించండి.
  3. ఉడికించిన దుంపలను తీసి ప్లేట్ లో వేసుకొని,మైదా పిండి,మొక్కజొన్న పిండి,కాస్త ఉప్పు ,కొంచెం నీరు చల్లుకుని కలుపుకోండి.
  4. బాండీలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగాక దుంపముక్కలు వేసి కాస్త బంగారు రంగు వచ్చేదాకా ఉంచి తీసేయండి.
  5. మరొక బాండి పెట్టీ అది వేడి చేయాలి. తరువాత వెల్లులి, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
  6. ఉల్లిపాయ ముక్కలు, కర్వేపాకు వేసి వేయించండి.
  7. ఇప్పుడు ఉప్పు,కారం ,ధనియాలపొడి, జీలకర్ర పొడి,గరంమసాలా వేసి కలుపుకోండి.
  8. పైవి వేగాక పోయి కట్టేసి,పెరుగు,నిమ్మకాయ రసం,రెడ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోండి.
  9. మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టీ పెద్ద ,దానిలో దుంప ముక్కలు వేసి,పెద్ద మంట పై అంత దగ్గర పడేదక గరిటతో తిప్పండి.
  10. అంతే ఎంతో తేలికగా రెస్టారెంట్ స్టీల్ లో ఆలూ 65 మన ఇంట్లో.మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర