కజ్జికాయలు | Gujiya Recipe in Telugu

ద్వారా Lakshmi Varun  |  29th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gujiya  recipe in Telugu,కజ్జికాయలు, Lakshmi Varun
కజ్జికాయలుby Lakshmi Varun
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కజ్జికాయలు వంటకం

కజ్జికాయలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gujiya Recipe in Telugu )

  • మైదా : 1కప్పు
  • గోధుమ పిండి : 1కప్పు
  • ఉప్పు : చిటికెడు
  • నెయ్యి : 50గ్రా"
  • నీళ్లు : తగినంత
  • నూనె : వేయించాడానికి సరిపడా
  • ఉప్మా రవ్వ : 1కప్పు
  • పంచదార : 1కప్పు
  • ఎండు కొబ్బరితురుము : 1కప్పు
  • యాలకులపొడి : 1/2 టీస్పూన్
  • డ్రై ఫ్రూట్స్ : తగినంత
  • కజ్జికాయల పీట

కజ్జికాయలు | How to make Gujiya Recipe in Telugu

  1. ఒక బౌల్ తీసుకొని మైదా,గోధుమపిండి,ఉప్పు వేడి చేసిన నెయ్యి వేసుకొని అన్ని బాగా కలిసెటట్టు కలుపుకొని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి 15ని" పక్కన పెట్టుకోవాలి.
  2. స్టఫ్ఫింగ్ కోసం ఒక కలాయి తీసుకొని 2స్పూనుల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని గిన్నెలోకీ తీసుకోవాలి.
  3. అదే కలాయిలో 3,4స్పూనుల నెయ్యి వేసి ఉప్మారవ్వని పచ్చివాసన పోయేవరకు దోరగా వేయించుకోని ఎండుకొబ్బరి , పంచదార,యాలకులపొడి,డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటే స్టఫ్ఫింగ్ రెడీ...
  4. కలిపిపెట్టిన పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా వత్తుకొని కజ్జికాయల పీట మీద వేసుకోని 2,3స్పూన్ల రవ్వ మిశ్రమం వేసి అంచుల చుట్టూ నీళ్ళతో తడిపి క్లోస్ చేసుకొని గట్టిగా నొక్కితే కజ్జికాయల షేప్ వస్తుంది...అలాగే అన్ని చేసుకోవాలి...
  5. ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి...నూనె వేడి ఐనా తరువాత కజ్జికాయలను వేసి తక్కువ మంటమీద వేయించుకోవాలి...
  6. అంతే కజ్జికాయలు రెడీ...గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే 1వీక్ వరకు నిల్వ వుంటాయి...

Reviews for Gujiya Recipe in Telugu (0)