హోమ్ / వంటకాలు / కజ్జికాయలు

Photo of Gujiya  by Lakshmi Varun at BetterButter
95
2
0.0(0)
0

కజ్జికాయలు

Nov-29-2018
Lakshmi Varun
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కజ్జికాయలు రెసిపీ గురించి

ఇవి చాలా టెస్టిగా ఉంటాయి..పిల్లలు,పెద్దలు అందరూ ఇష్టపడతారు.చెయ్యడటానికి కూడా తెలీకగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా : 1కప్పు
  2. గోధుమ పిండి : 1కప్పు
  3. ఉప్పు : చిటికెడు
  4. నెయ్యి : 50గ్రా"
  5. నీళ్లు : తగినంత
  6. నూనె : వేయించాడానికి సరిపడా
  7. ఉప్మా రవ్వ : 1కప్పు
  8. పంచదార : 1కప్పు
  9. ఎండు కొబ్బరితురుము : 1కప్పు
  10. యాలకులపొడి : 1/2 టీస్పూన్
  11. డ్రై ఫ్రూట్స్ : తగినంత
  12. కజ్జికాయల పీట

సూచనలు

  1. ఒక బౌల్ తీసుకొని మైదా,గోధుమపిండి,ఉప్పు వేడి చేసిన నెయ్యి వేసుకొని అన్ని బాగా కలిసెటట్టు కలుపుకొని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి 15ని" పక్కన పెట్టుకోవాలి.
  2. స్టఫ్ఫింగ్ కోసం ఒక కలాయి తీసుకొని 2స్పూనుల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని గిన్నెలోకీ తీసుకోవాలి.
  3. అదే కలాయిలో 3,4స్పూనుల నెయ్యి వేసి ఉప్మారవ్వని పచ్చివాసన పోయేవరకు దోరగా వేయించుకోని ఎండుకొబ్బరి , పంచదార,యాలకులపొడి,డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటే స్టఫ్ఫింగ్ రెడీ...
  4. కలిపిపెట్టిన పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలా వత్తుకొని కజ్జికాయల పీట మీద వేసుకోని 2,3స్పూన్ల రవ్వ మిశ్రమం వేసి అంచుల చుట్టూ నీళ్ళతో తడిపి క్లోస్ చేసుకొని గట్టిగా నొక్కితే కజ్జికాయల షేప్ వస్తుంది...అలాగే అన్ని చేసుకోవాలి...
  5. ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి...నూనె వేడి ఐనా తరువాత కజ్జికాయలను వేసి తక్కువ మంటమీద వేయించుకోవాలి...
  6. అంతే కజ్జికాయలు రెడీ...గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే 1వీక్ వరకు నిల్వ వుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర