హోమ్ / వంటకాలు / వెజ్ నూడుల్స్ సమోసా.

Photo of Veg noodles samosa by Chandrika Marripudi at BetterButter
607
2
0.0(0)
0

వెజ్ నూడుల్స్ సమోసా.

Nov-30-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ నూడుల్స్ సమోసా. రెసిపీ గురించి

సమోసా ఒక ఫేమస్ స్నాక్ ఐటమ్. దీనిలో ఉల్లిపాయ, ఆలూ కూర,స్వీట్ కార్న్ ఇలా రకరకాల స్టఫింగ్ పెట్టి చేస్తారు.ఇక్కడ నేను నూడుల్స్ కూరగాయలతో కలిపి స్టఫింగ్ చేశాను.చాలా బాగున్నాయి. మీరు చేసుకుని చూడండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. మల్టీగ్రైన్ ఆటా : 2 కప్పులు
  2. వాము : 2స్పూన్లు
  3. ఉప్పు : తగినంత
  4. నూనె : 2స్పూన్లు
  5. నూడుల్స్ పాకెట్ : 1
  6. ఉల్లిపాయలు : 2
  7. టమోటా : 1
  8. క్యారెట్ : 1(పెద్దది)
  9. బంగాళదుంపలు : 2
  10. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. ముందుగా పిండిలో వాము,ఉప్పు, నూనె వేసి కలిపి నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి.
  2. స్టవ్ పైన గిన్నెలో నీళ్ళు పోసి మరిగించి నూడుల్స్ వేసి 2 నిమిషాలు ఉడికించి నీళ్ళు వార్చి పెట్టుకోవాలి.
  3. మళ్లీ స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ,టమోటా, ఆలూ,క్యారెట్ సన్నగా తరిగి వేయించుకోవాలి.
  4. కొద్దిగా వేగాక నూడుల్స్ మసాలా వేసి కలిపి వేయించాలి.
  5. తరువాత ఉడికించిన నూడుల్స్ వేసి బాగా కలుపుకుని ఒకనిమిషం వేయించి పక్కన పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న ముద్దలు చేసి వత్తుకుని త్రిభుజాకారంగా కోసుకుని కోన్ లా చేసి స్పూనుతో నూడుల్స్ మిశ్రమం స్టఫ్ చేసి తడి చేసి అంచులు మూసి పెట్టుకోవాలి.
  7. స్టవ్ పైన బాండీలో నూనె పోసి వేడయ్యాక సమోసాలను వేసి డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర