బననా పూరి | Banana poori Recipe in Telugu

ద్వారా swetha vijayagiri  |  30th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Banana poori by swetha vijayagiri at BetterButter
బననా పూరిby swetha vijayagiri
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

బననా పూరి వంటకం

బననా పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Banana poori Recipe in Telugu )

  • గోధుమ పిండి: 1 కప్
  • అరటిపండు: 2
  • ఇలాచి పొడి: 1/2 స్పూన్
  • కొబ్బరిపొడి: 2 స్పూన్స్
  • బెల్లం: 1/2 కప్
  • బియ్యం పిండి: 1/4 కప్
  • ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా

బననా పూరి | How to make Banana poori Recipe in Telugu

  1. ముందుగా అరటిపండ్ల ని మెత్తగా మెదుపుకొని పెట్టుకోవాలి
  2. ఒక బౌల్ లో బియ్యం పిండి,గోధుమ పిండి,ఇలాచి పొడి,కొబ్బరిపొడి వేసి కలుపుకోవాలి
  3. స్టవ్ మీద గిన్నె పెట్టి బెల్లం వేసి 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని వేడి చెయ్యాలి.నీళ్ళు వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కలుపుకున్న పిండి అరటి పండు గుజ్జు 3 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు పిండి చల్లారాక బాగా మర్దనా చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు పిండి ని తీసుకొని చిన్న ఉండలు చేసుకుని చేతి తో ఒత్తుకొని డీప్ఫ్రై చేసుకోవాలి
  6. బననా పూరి వేడి వేడిగా రెడీ

Reviews for Banana poori Recipe in Telugu (0)