హోమ్ / వంటకాలు / మలై కోఫ్తా కరి

Photo of Malai kofta curry by Reena Andavarapu at BetterButter
437
3
0.0(0)
0

మలై కోఫ్తా కరి

Dec-02-2018
Reena Andavarapu
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మలై కోఫ్తా కరి రెసిపీ గురించి

టెస్ట్య్ ఈసీ హెల్త్య్ మలై కిఫ్తా ట్ర్య్ చేయండి. ఇవి పనీర్ స్టఫ్ఫ్డ్ ఆలూ కోఫ్తా.దీనిలో పాలకూర ఇంకా ఉల్లి కాడలు వేసి హెల్తీ గా తయారు చేసాను .చాలా సులభంగా తయ్యార్ చేయవొచ్చు. మాలబర్ పరోటతో టెస్ట్ ఆడిరిపోతుంది. చపాతీ ,నాన్ గాని ఫుల్కలుతో కూడా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • రాత్రి విందు
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. కోఫ్తా కోసం :
 2. 4 పెద్ద బంగాళాదుంపలు
 3. తురిమిన పనీర్ 200 గ్రామ్స్
 4. 1/2 కప్పు ఉడికించుకొని తరిగిన పాలకూర
 5. ఉల్లి కాడలు 1/4 కప్పు
 6. పచ్చి కారం 1 టేబుల్స్పూన్
 7. పసుపు 1/2 స్పూన్
 8. మిరియాలు పొడి 1/4 స్పూన్
 9. ఉప్పు తగినంత
 10. చిన్నగా కోసిన పచ్చి మిరపకాయ 1
 11. కొత్తిమీర 2 టేబుల్స్పూన్
 12. కార్న్ ఫ్లోర్ పేస్ట్ :
 13. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్
 14. 1/2 కప్పు మంచి నీరు.
 15. 3 టేబుల్స్పూన్ కార్న్ ఫ్లోర్ కోటింగుకి
 16. కరి కోసం:
 17. మసాలా పేస్ట్ :
 18. రెండు టేబుల్స్పూన్ గసగసాలు
 19. 3 టేబుల్స్పూన్ కొబ్బరి తురుము
 20. 6 జీడిపప్పు
 21. 1/2 కప్ మంచి నీరు
 22. మిగతా పదార్థాలు:
 23. కారం ఒక టీస్పూన్
 24. పసుపు 1/2 టీస్పూన్
 25. గరం మసాలా పొడి 1/2 స్పూన్
 26. పంచదార 1/2 స్పూన్
 27. మసాలా దినుసులు :
 28. 2 దాల్చిన చెక్క
 29. 2 యాలుకలు
 30. 4 లవంగాలు
 31. బిర్యాని ఆకులు 2
 32. కసూరి మేథీ 1 టేబుల్స్పూన్
 33. 2 పెద్ద ఉల్లిపాయ చిన్న తరుగు
 34. 2 టొమాటో చిన్న ముక్కలు కోసి
 35. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద
 36. నెయ్య 2 టేబుల్స్పూన్
 37. నూనె ఒక స్పూన్
 38. కొత్తిమీర 2 టేబుల్స్పాన్
 39. డీప్ ఫ్రైకి నూనె

సూచనలు

 1. ముందుగా కరి కోసం గసగసాలు , జీడి పప్పు అర కప్పు నీళ్లలో 10 నిముషాలు నాన బెట్టాలి. తరువాత కొబ్బరి తురుము తో ముక్సీలో పేస్ట్ చేసుకోవాలి
 2. ఒక ప్రెషర్ పాన్లో నెయ్య నుని వేసి బిర్యాని ఆకులు ఇంకా అన్ని మసాలా దినుసులు వేసి వేయించాలి
 3. ఉల్లిపాయ ముకలు కొంచెం ఉప్పు , ఇంకా చిటికెడు పంచదారతో వేయించాలి.
 4. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి టమాట ముక్కలు ఇంకా అన్నీ పొడులు వేసి మిక్స్ చేసుకోవాలి.మూత పెట్టి 2 విసిల్లు ప్రెషర్ కుక్ చేసుకొని గాస్ ఆర్పేయాలి .
 5. ప్రెషర్ పోయేక మోత తీసి గరిటీతో బాగా మాష్ చేస్తూ కలిపికోవాలి.జీడపపు పేస్ట్ వేసి తగినంత నీరు (2 కప్పులు)ఇంకా ఉప్పు ,పంచదార వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
 6. ఉడికేక కసూరి మేథీ మెదిపి వేసుకోవాలి. మలై కరి రెడీ.
 7. కోఫ్తా కోసం బంగాళాదుంపలు ఉడికించి తొక్క తీసి మెష్ చేసుకోవాలి.
 8. పన్నీర్ ,కన్ఫలౌర్ తప్ప అన్ని పదార్థాలు దుంపలో వేసి మిక్స్ చేసుకోవాలి
 9. పనీర్ తురుముకొని ఉంచాలి
 10. 2 టేబుల్స్పూన్ కోర్న్ఫ్లర్ మంచి నీరుతో కలిపి ఉంచాలి
 11. మిగితా కోర్న్ఫ్లర్ ఒక ప్లేట్ మీద తీసుకోవాలి
 12. ఆయిల్ డీప్ ఫ్రై కి వేడి చేసుకోవాలి
 13. ఒక ప్లేట్ మీద టిష్యూ వేసి రెడీగా ఉంచాలి
 14. దుంపల ముద్ద నిమ్మకాయంత బోల్స్ చేసి ఉంచాలి
 15. ఒక బాల్ తీసుకొని మధ్యలో పనీర్ స్టఫ్ చేసి చుట్టాలి
 16. అన్ని కోఫ్తాలు ఇలా చేసుకొని ఉంచాలి
 17. ఒక ఒక కోఫ్తా సిర్న్ఫ్లర్ నీరుతో ముంచి మళ్ళీ కన్ఫ్లిర్ లో రోల్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
 18. టిష్యూలో తీయాలి
 19. ఇప్పుడు సర్వ్ చేయడానికి ప్లాటిలో గ్రేవై వేసి కోఫ్తాలు పేర్చుకోవాలి .
 20. టేస్టీ మలై కోఫ్తా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర