హోమ్ / వంటకాలు / గుత్తి వంకాయ కారం

Photo of Stuffed brinjal fry by Chandrika Marripudi at BetterButter
1295
4
0.0(0)
2

గుత్తి వంకాయ కారం

Dec-03-2018
Chandrika Marripudi
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తి వంకాయ కారం రెసిపీ గురించి

గుత్తి వంకాయ కారం వంకాయలను చీల్చి నూనెలో వేయించి ప్రత్యేకంగా తయారు చేసిన కారం కూర్చి చేసుకునే వేపుడు. అన్నంతో చాలా బాగుంటుంది.పచ్చిమిర్చి కూడా చీల్చి వేయించి వంకాయలతో పాటు కారం పెట్టుకుంటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 6

  1. వంకాయలు : 1/2 కేజీ
  2. ఉల్లిపాయలు : 4
  3. పచ్చిమిర్చి : 10
  4. పోపుదినుసులు : 4 స్పూన్లు
  5. కరివేపాకు : 2రెమ్మలు
  6. పసుపు : 1/2 స్పూన్
  7. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ
  8. పొడి కోసం
  9. వేయించిన శనగపప్పు(పుట్నాలు):1/2 కప్పు
  10. పల్లీలు : 4 స్పూన్లు
  11. నువ్వులు : 4 స్పూన్లు
  12. జీలకర్ర : 2 స్పూన్లు
  13. వెల్లుల్లి రెబ్బలు : 10
  14. ఎండుకారం : 4 స్పూన్లు
  15. ఎండుకొబ్బరి : అరచిప్ప
  16. ఉప్పు : తగినంత

సూచనలు

  1. ముందుగా పల్లీలు,నువ్వలు పాన్లో నూనె లేకుండా వేయించుకోవాలి.
  2. తరువాత పుట్నాలు, ఎండుకొబ్బరి, కారం,ఉప్పు,వెల్లుల్లి, జీలకర్ర,వేయించుకున్న పల్లీలు,నువ్వులు అన్నీ మిక్సీలో పొడి చేసుకోవాలి.
  3. వంకాయలను కడిగి తుడిచి మద్యకి చీల్చి నూనెలో వేయించి పెట్టుకోవాలి.
  4. పచ్చిమిర్చి కూడా చీల్చి నూనెలో వేయించుకుని పెట్టుకోవాలి.
  5. వేయించుకున్న వంకాయలు,పచ్చిమిర్చిలో తయారు చేసిన పొడిని కూరి పెట్టుకోవాలి.
  6. స్టవ్ పైన బాండీ పెట్టి 4 స్పూన్ల నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు వేసి వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
  7. ఉల్లిపాయ ముక్కలు వేగాక కారం పెట్టిన వంకాయ,మిర్చి వేసి కలిపి ఒకనిమిషం వేయించి కూర్చగా మిగిలిన కారం పొడి వేసి కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర