హోమ్ / వంటకాలు / క్యాలీఫ్లవర్ 65

Photo of Gobi 65 by Chandrika Marripudi at BetterButter
621
2
0.0(0)
0

క్యాలీఫ్లవర్ 65

Dec-05-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాలీఫ్లవర్ 65 రెసిపీ గురించి

క్యాలీఫ్లవర్ 65 మైదా,కార్న్ ఫ్లోర్ కలిపిన పిండిలో ముంచి నూనెలో వేయించే స్నాక్ ఐటమ్.తేలికగా చేసుకోవచ్చు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. క్యాలీఫ్లవర్ : 1
  2. మైదాపిండి : 1 కప్
  3. కార్న్ ఫ్లోర్ : 4 టేబుల్ స్పూన్లు
  4. ఉప్పు : తగినంత
  5. కారం : 1 స్పూన్
  6. గరంమసాలాపొడి : 1 స్పూన్
  7. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
  8. ఫుడ్ కలర్ : చిటికెడు
  9. పసుపు : 1/2 స్పూన్
  10. పెరుగు : 1/4 కప్
  11. పచ్చిమిర్చి : 10
  12. కరివేపాకు : 4 రెమ్మలు
  13. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. క్యాలీఫ్లవర్ ని తరిగి నీళ్ళు మరిగించి ఉప్పు, పసుపు వేసి ఉడికించి నీళ్లు వార్చి చల్లటి నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్ వేసి ఉప్పు, కారం,అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలాపొడి, ఫుడ్ కలర్ వేసి కలిపి నీళ్ళు పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి.
  3. ఉడికించిన క్యాలీఫ్లవర్ను పిండిలో వేసి కలుపుకోవాలి
  4. బాండీలో డీప్ ఫ్రైకి నూనె పోసి కాగనివ్వాలి
  5. పిండిలో ముంచిన గోబీని ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేయించుకోవాలి.
  6. తరువాత బాండీలో 2 స్పూన్ల నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి
  7. ఇప్పుడు దాన్లో పెరుగు వేసి కలిపి కొద్దిగా ఉప్పు, ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి
  8. ఇప్పుడు వేయించుకున్న గోబీని వేసి కలిపి ఒకనిమిషం వేయించుకుని ప్లేటులోకి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర