హోమ్ / వంటకాలు / వెజ్ కోన్స్

Photo of Veggie Cones by Sudha Badam at BetterButter
109
5
0.0(0)
0

వెజ్ కోన్స్

Dec-06-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ కోన్స్ రెసిపీ గురించి

స్వీట్ కార్న్ తో చేసుకునే ఒక స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • కఠినము
 • పండుగలాగా
 • ఆంధ్రప్రదేశ్
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

 1. కోన్స్ కోసం
 2. మైదా 1/4 కేజీ
 3. వాము1/2 స్పూను
 4. డాల్డా 2 స్పూన్లు
 5. ఉప్పు తగినంత
 6. Stuffing కోసం
 7. బంగాళాదుంపలు 2
 8. ఉల్లిపాయ 1
 9. స్వీట్ కార్న్ 1 కప్పు
 10. పచ్చిమిర్చి 4
 11. పసుపు చిటికెడు
 12. చాట్ మసాలా 1/2 స్పూను
 13. కారం 1/2 స్పూను
 14. ఉప్పు తగినంత
 15. కొత్తిమీర కొద్దిగా
 16. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
 17. సేవ్ గార్నిష్ కోసం

సూచనలు

 1. ముందుగా మైదాలో వాము, ఉప్పు, మరిగించిన డాల్డా వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
 2. ఈ తడిపిన పిండిని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
 3. బంగాళాదుంపలు, స్వీట్ కార్న్ ఉడికించి ఉంచుకోవాలి.
 4. ఈ లోపు కదాయి పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి,ఉడికించిన స్వీట్ కార్న్, బంగాళదుంప ముద్ద, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆపేసి కూర చల్లారనివ్వాలి.
 5. చిన్న గిన్నెలో2 స్పూన్లు మైదా, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసుకుని చిక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలి.
 6. పక్కన ఉంచుకున్న చపాతీ పిండిని, నిమ్మకాయంత తీసుకుని కొంచెం దాలసరిగా చపాతీ ల వత్తుకుని ఫోర్క్ తో అక్కడక్కడ గుచ్చుకోవాలి.
 7. ఈ చపాతీ ని పెనం మీద రెండు వైపులా 5 సెకండ్ల పాటు కాల్చుకోవాలి.
 8. ఈ చపాతీ ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఒకొక్క ముక్కని కోన్ ఆకారంలో మడుచుకుని అంచులు మైదా పేస్ట్ తో అతికించుకోవాలి.
 9. ఈ కోన్స్ ని తయారుచేసుకున్న కూరతో నింపి కూర బయటకి రాకుండా మైదా పేస్ట్ తో సీల్ చెయ్యాలి.
 10. వీటిని మరిగిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
 11. ఎర్రగా వేగాక బయటకు తీసి కొద్దిగా చల్లారాక టమాటా సాస్ లో డిప్ చేసి సేవ్, కోతిమీరతో గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర