Photo of Aloo bonda by Suma Latha at BetterButter
1761
2
5.0(0)
1

Aloo bonda

Dec-07-2018
Suma Latha
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలూ - 6
  2. నూనె- 2 స్పూన్స్
  3. శెనగ పప్పు -1/2 స్పూన్
  4. మిన్నప్ పప్పు -1/2స్పూన్
  5. ఆవాలు -1/4 స్పూన్
  6. జీలకర్ర - 1/4 స్పూన్
  7. గరం మసాలా -1/2 స్పూన్
  8. కొత్తిమీర - కొంచం సన్నగా క్యూట్ చేసుకోవాలి
  9. ఉప్పు - తగినంత
  10. కారం - తగినంత
  11. పసుపు - చిటికెడు
  12. నిమకాయా - ఒకటి (రసం తీసుకోవాలి)
  13. శెనగ పిండి - 1 కప్
  14. బియ్యప్పిండి - 2 లేక 3 స్పూన్లు
  15. నీళ్ళు - సరిపడా
  16. వంట సోడా - చిటికెడు
  17. జీల్లకర పొడి - 1/2 స్పూన్ (పచ్చిదే)
  18. ఉప్పు - తగినంత
  19. కారం - ఆప్షన్
  20. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా కూర తయారీ విధానం , ఆలూ ని శుభ్రంగా కడుక్కోవాలి , వాటిని రెండు ముక్కలు చేసుకోండి
  2. ఇప్పుడు కుక్కర్ లో కొంచం నీళ్ళు పోసి 3 విస్తెల్స్ వచ్చే వరకు వుడికించుకొండి
  3. కుక్కర్ చల్లారాక మూత తీసి ఆలూ మీద చల్లని నీళ్ళు పోయండి అప్పుడు అవి చల్లారుతాయి !
  4. ఇప్పుడు ఆలూ కి వున్న తొక్క తీసి మెత్తగా చిదుముకొండి
  5. ఇక పోతే స్టౌ వెలిగించి ఒక్ పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ నూనె పోసి వేడి అవనివండి
  6. దాంట్లో శెనగ పప్పు ,మిన్నపప్పు ,ఆవాలు ,జీలకర్ర ,పచి మిర్చి ముక్కలు ఒక్క దాని తరువాత ఒక్కటి వేయించుకొండి !
  7. దాంట్లో పసుపు వేసి ఆలూ చిదిమి పెటుకున్నది వేసుకోండి
  8. కాసేపు మగ్గనివ్వాలి దాంట్లో ఉప్పు , కారం , గరం మసాలా వేసుకోండి
  9. స్టౌ ఆఫ్ చేసి దాంట్లో నిమ్మ రసం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది వేసుకోండి
  10. కాసేపు ఆ కూర చల్లారే టానికి వుంచండి. చలారక .చిన్న చిన్న ఉండలు చేసుకోండి.
  11. అలా కాసేపు వదిలేయండి. ఇప్పుడు బోండా (బజ్జీ) పిండి తయారీ విధానం:
  12. శెనగ పిండి , బియ్యప్పిండి ,ఉప్పు , జీల్లకర్ర పొడి ,వంటసోడా వేసి నీళ్ళు కొంచం కొంచముగా పోస్తూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి
  13. కారం మీ ఛాయిస్ (మ బాబు కోసం కదా నేను ఈ పిండిలో వేయలేదు) కూరలో వేసుకున్న అందుకే పిండిలో వేయలేదు
  14. స్టౌ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రై కి తగ్గ నూనె పోయాలి నూనె వేడి ఆయ్యాక
  15. ఇప్పుడు ఈ ఆలూ ఉండలు ఆ పిండి ముంచి ఆ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటమే!!
  16. అంతే ఆలూ బోండా రెడీ & ధన్యవాదాలు
  17. దీన్ని టమాటో సాస్ తో తింటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర