హోమ్ / వంటకాలు / ఆలూ బోండా

Photo of Aloo bonda by ప్రశాంతి మారం at BetterButter
765
5
0.0(0)
0

ఆలూ బోండా

Dec-08-2018
ప్రశాంతి మారం
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బోండా రెసిపీ గురించి

స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలూ గడ్డ - అర కేజీ
  2. ఉల్లిపాయలు-3
  3. పచ్చిమిర్చి పేస్ట్ - 1 స్పూన్
  4. ఉప్పు - అర చెంచా
  5. నిమ్మకాయ- ఒకటి
  6. కొత్తిమీర - 1 కట్ట
  7. అల్లంవెల్లుల్లి ముద్ద - అర స్పూన్
  8. శనగపిండి - 250 గ్రామ్స్
  9. వామ - 2 చిటికెలు
  10. జీరా- పావు స్పూన్
  11. పసుపు- పావు స్పూన్
  12. వంటసోడా- 2 చిటికెలు
  13. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఆలు గడ్డలని ఉడికించి పొత్తు తీసి మెదిపి పెట్టుకోవాలి.
  2. ఒక పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిముక్కలు, పసుపు వేసి వేగాక పచ్చిమిర్చి పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ మీద నుంచి తీసుకుని నిమ్మరసం వేసి మొత్తం బాగా కలిపి ఉంచుకోవాలి.
  3. డీప్ ఫ్రై కి తగినంత నూనె పోసి కాగనివ్వాలి.
  4. ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, వాము, జీరా, వంటసోడా వేసి నీటితో పిండి కలుపుకోవాలి.
  5. ఆలూ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి.
  6. ఇప్పుడు ఆలూ ఉండల్ని శనగపిండి లో ముంచి కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీయాలి.
  7. వేడి వేడి ఆలూ బోండా రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర