హోమ్ / వంటకాలు / మిక్సడ్ వెజ్ కర్రీ

Photo of Mixed veg curry by Sree Sadhu at BetterButter
59
5
0.0(0)
0

మిక్సడ్ వెజ్ కర్రీ

Dec-09-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్సడ్ వెజ్ కర్రీ రెసిపీ గురించి

ఇది రోటి లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ 1/2 కప్ తరిగినది
  2. కాప్సికం తరిగినది 1
  3. ఉల్లిపాయ తరిగినది 3
  4. టమాటో 3-4
  5. వెల్లులి రెబ్బలు 4-5
  6. అల్లం పేస్ట్ 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. గరం మసాలా 1 చెంచా
  10. పసుపు చిటికెడు
  11. నూనె 3-4 చెంచాలు
  12. లవంగాలు 2
  13. మిరియాలు 2-3
  14. జీలకర్ర 1 చెంచా
  15. నీళ్లు తగినంత
  16. కాలీఫ్లవర్ 1 కప్
  17. ఉడికించిన బఠాణి 1 కప్
  18. ఎండుమిర్చి 2

సూచనలు

  1. ముందుగా టమాటో, అల్లం, వెల్లులి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి
  2. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి క్యారెట్, బ్లాంచ్ చేసిన కాలీఫ్లవర్, కాప్సికం వేయించుకోవాలి
  3. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి అందులో మళ్ళి నూనె వేసి జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, లవంగాలు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ వేసి ఎర్రగా వేయించాలి
  5. ఉల్లిపాయ వేగిన తరువాత అందులో తయారు చేసిన పేస్ట్ వేసి దెగ్గర పడే వరకు వేయించాలి
  6. వేగిన తరువాత అందులో పసుపు, ఉప్పు , కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  7. అందులో వేయించిన వెజిటబుల్స్ వేసి బాగా కలుపుకోవాలి
  8. అందులో నీళ్లు వేసి బాగా ఉడకనివ్వాలి
  9. అవి ఉడికిన తరువాత బఠాణి వేసి బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర