హోమ్ / వంటకాలు / చికెన్ ఫ్రైడ్ వింగ్స్(వేయించిన కోడి రెక్కలు)

Photo of Chicken fried wings by Chandrika Marripudi at BetterButter
70
2
0.0(0)
0

చికెన్ ఫ్రైడ్ వింగ్స్(వేయించిన కోడి రెక్కలు)

Dec-09-2018
Chandrika Marripudi
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ ఫ్రైడ్ వింగ్స్(వేయించిన కోడి రెక్కలు) రెసిపీ గురించి

చికెన్ ఫ్రైడ్ వింగ్స్ KFC లో తెచ్చుకుని తినే స్నాక్ ఐటమ్. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎపుడూ బయట తెచ్చుకునేకంటే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం, ఆనందం రెండూ ఉంటాయి. పిల్లలు కూడా సంతోషంగా తింటారు. మీరూ ప్రయత్నించండి.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. చికెన్ వింగ్ పీసులు : 6
  2. ఉప్పు : తగినంత
  3. కారం : 2 స్పూన్లు
  4. మిరియాలపొడి : 1 స్పూన్
  5. అల్లం వెల్లుల్లి పేస్టు : 2 స్పూన్లు
  6. గరంమసాలాపొడి : 1 స్పూన్
  7. పసుపు : 1/2 స్పూన్
  8. నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్
  9. కోడిగుడ్లు : 4
  10. మైదా : 1 కప్
  11. కార్న్ ఫ్లోర్ : 1కప్
  12. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. ముందుగా చికెన్ పీసులు కడిగి ఉప్పు, కారం,అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలాపొడి, పసుపు, నిమ్మరసం వేసి కలిపి 2 గంటలు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
  2. కోడిగుడ్లు పగలగొట్టి ఒక గిన్నెలోకి చిటికెడు ఉప్పు, కారం,మిరియాలపొడి వేసి గిలకొట్టుకోవాలి.
  3. మైదా,కార్న్ ఫ్లోర్ ఒక ప్లేటులోకి తీసుకుని కొద్దిగా ఉప్పు, కారం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి
  4. స్టవ్ పైన బాండీలో నూనె పోసి కాగనివ్వాలి.
  5. కలిపి పెట్టుకున్న చికెన్ పీసులు ఒకొకటి తీసుకుని గుడ్డుసొనలో ముంచాలి
  6. తరువాత దాన్ని పిండిలో వేసి కోటింగ్ లాగా చికెన్ పీసు మొత్తానికి పట్టించాలి.
  7. ఇలా పట్టించుకున్నవాటిని నూనెలో వేయించుకోవాలి. మంట చిన్నగా పెట్టి వేయిస్తే లోపల కూడా బాగా వేగుతుంది.
  8. ఇలా అన్నింటినీ ఎర్రగా వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర