హోమ్ / వంటకాలు / సోయా కుకురే ఫ్రైడ్ మోమోస్

Photo of Fried Soya kukure momos by Pravallika Srinivas at BetterButter
455
4
0.0(0)
0

సోయా కుకురే ఫ్రైడ్ మోమోస్

Dec-10-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా కుకురే ఫ్రైడ్ మోమోస్ రెసిపీ గురించి

ఈ వంటకం స్నాక్ టైం లో చాలా బాగుంటుంది.సాధారణంగా సోయా చoక్స్ పులవ్,బిర్యానీ లో లేదంటే కూర లాగా చేస్తుంటాం.శాఖహారులకు మాంసకృత్తులు అందించడాని ఒక వరం ఈ సోయా చంక్స్.వీటితో స్టూఫిన్గ్ చేసి పైన మొక్కజొన్న అటుకులో ముంచి వేయించి చేసినది ఈ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఫిల్లింగ్ లేదా స్టూఫిన్గ్ కోసం కావలసినవి :
  2. సోయా చంక్స్ - 2 కప్పులు
  3. నీరు - ఉడికించుకోవడానికి సరిపడా
  4. ఉల్లితరుగు - 1
  5. అల్లం తరుగు - 2 అంగుళాలు
  6. వెల్లులి తరుగు - 2 స్పూన్లు
  7. క్యారోట్ తురుము - 1 కప్
  8. స్ప్రింగ్ ఆనియన్ ఒక రెమ్మ
  9. నీరు - తగినంత
  10. సోంపు- 1 స్పూను
  11. గరం మసాలా - 1 స్పూను
  12. వెజిటబుల్ మసాల - 1 స్పూను
  13. పచ్చిమిర్చి తరుగు -2 లేదా 3
  14. వెన్న / నెయ్యి - 1 స్పూను
  15. కాశ్మీరీ కారం - 1/2 స్పూను
  16. ఉప్పు - తగినంత
  17. చపాతి పిండి కోసము కావాల్సిన పదార్థాలు :
  18. మైదా - 2 కప్పులు
  19. ఉప్పు -తగినంత
  20. నెయ్యి/నూనె -2స్పూన్లు
  21. నీరు - తగినంత
  22. పూత పిండి కోసం :
  23. మైదా - 3 స్పూన్లు
  24. బియ్యం పిండి - 1.5 స్పూను
  25. ఉప్పు సరిపడా
  26. నీరు తగినంత
  27. ధనియాలు జీలకర్ర పొడి - 1/4 స్పూను
  28. కాశ్మీరీ కారం - 1/4 స్పూను
  29. కార్న్ అటుకులు - 2 కప్పులు
  30. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నీలో నీరు పోసి బాగా మరిగించి సోయా చంక్స్ వేసి ఒక 10 నిమిషాలు ఉంచి నీరు వార్చుకుని చల్లారనివ్వాలి.
  2. ఈలోగా ఒక బేసన్ లో మైదా పిండి, ఉప్పు,నెయ్యి వేసి కలుపుకోవాలి.
  3. పైనుండి కొంచం నీరు పోస్తూ గట్టిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.పైన మూత పెట్టుకోవాలి.
  4. చల్లారిన సోయా చుంక్స్ ను నీరు మొత్తం పోయే వరకు పిండుకొని మరొక గిన్నీలో వేసుకోవాలి.
  5. వీటిని ఒక మిక్సర్ జార్ లో వేసుకుని పల్స్ లో కోర్సెగా గ్రైండ్ చేసుకోవాలి.
  6. తరిగిన పదార్థాలు అన్ని సిద్ధం చేసుకోవాలి.
  7. ఇప్పుడు ఒక బాండీ పెట్టి వేడయ్యాక వెన్న వేసి కాగాక సోంపు వేసి చితపటలాడానివ్వాలి.
  8. ఇప్పుడు సిద్ధం చేసినవి అన్ని వేసి కలుపుకోవాలి.
  9. కొంచం వేగాక తురిమిన క్యారెట్ కూడా వేసి మగ్గనివ్వాలి.
  10. ఇప్పుడు గ్రైండ్ చేసిన సోయా కూడా వేసి బాగా కలుపుకొని మరికొంచెం వేగనివ్వాలి.
  11. ఆ తర్వాత ఉప్పు,కారం,గరం మసాలా,వెజిటబుల్ మసాలా,పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  12. తయారైన మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో తీసి చల్లారనివ్వాలి.
  13. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసిన మైదా పిండిని మర్దన చేసి పల్చగా వత్తుకుని చిన్న సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి.
  14. ఇప్పుడు వీటిని మరికొంచెం పల్చాగా వత్తి స్టఫ్ ఈ విధంగా పెట్టుకోవాలి.
  15. దీనిని మధ్యకు మడిచి కజ్జికాయలు లాగా మోమోస్ సిద్ధం చేసుకోవాలి.
  16. అన్నింటిని ఇలాగే చేసి పెట్టుకోవాలి.
  17. ఇప్పుడు ఒక గిన్నీలో మైదా,బియ్యం పిండి,ఉప్పు,కారం,ధనియాల జీలకర్ర పొడి వేసి నీరుపోసి పల్చగా బజ్జి పిండి లాగా కలుపుకోవాలి.
  18. మరొక బౌల్ లో మొక్కజొన్న అటుకులు నలిపి పెట్టుకోవాలి.ఇప్పుడు తయారు అయిన మెమోలను పిండిలో ముంచుకొవ్వాలి.
  19. వీటిని మొక్కజొన్న అటుకులలో ముంచి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.
  20. అన్నింటిని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి .
  21. ఒక కడాయిలో నూనె వేసి మీడియం హీట్ లో కాగగా తగినన్ని మెమోలు వేసి దోరగా వేయించుకోవాలి.
  22. తయారైన వాటిని కిచెన్ టిష్యూలో వేసి సెర్వింగ్ ప్లేట్ లో తీసుకుని టమాటో చట్నీ తో సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర