పానీ పూరి | Paani Poori Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  10th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Paani Poori   by రమ్య వూటుకూరి at BetterButter
  • తయారీకి సమయం

    2

    గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పానీ పూరి వంటకం

పానీ పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paani Poori Recipe in Telugu )

  • పూరి తయారీకి
  • ఉప్మారవ్వ 1 కప్
  • ఉప్పు తగినంత
  • ఆయిల్ డీపీఫ్రై కి తగినంత
  • ఆలూ మిక్స్ కోసం
  • గరం మసాలా 1/2 స్పూన్
  • ఉప్పు తగినంత
  • దానియా పొడి 1 స్పూన్
  • కారం 1 స్పూన్
  • ఆలూ 4
  • క్యారెట్ 2
  • బఠాణీలు 1 కప్
  • నెయ్యి 3 స్పూన్స్
  • పానీ కోసం
  • వాటర్ 4 గ్లాస్సెస్
  • చింతపండు నిమ్మకాయంత
  • ఉప్పు కొంచం
  • బ్లాక్ సాల్ట్ 1 స్పూన్
  • పుదీనా 1/2 కప్
  • కోతిమీర 1/2 కప్
  • పానీ పూరి మసాల 1 స్పూన్
  • షుగర్ 1 స్పూన్
  • పచ్చి మిర్చి 3
  • జీలకర్ర పొడి 1/2 స్పూన్
  • ఉల్లిపాయ ముక్కలు 1 కప్

పానీ పూరి | How to make Paani Poori Recipe in Telugu

  1. ఉప్మా రవ్వ లో ఉప్పు నీళ్లు పోసుకొని కొంచం జారుడుగా కల్పి 2 గంటలు మూత పెట్టి ఉంచాలి
  2. పిండి నాని గట్టిగా అవుతుంది
  3. బాగా కలిపి చిన్న చిన్న పూరీలు చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి
  4. బాగా పొంది క్రిస్పీ గా అయ్యాక తీసి డబ్బాలో వేసుకోవాలి
  5. ఆలూ మిక్స్ తయారీ
  6. ఆలూ క్యారెట్ బఠాణీలు కొంచం సాల్ట్ వాటర్ పోసి 4 విస్సెల్స్ వచ్చేవరకు ఉడికించాలి
  7. ఉడికాక మెత్తగా మెదుపుకోవాలి
  8. ఒక బాండీ లో నెయ్యి ఉప్పు కారం గరం మసాలా దానియా పొడి వేసి 1 మినిట్ వేగాక ఆలూ మిక్స్ వేసి కలుపుకోవాలి
  9. తయారు అయిన ఆలూ మిక్స్ ని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి
  10. పానీ తయారీ
  11. చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి
  12. దానిలో వాటర్ పోసుకొని షుగర్ ఉప్పు పానిపూరీ మసాలా బ్లాక్ సాల్ట్ జీలకర్ర పొడి వెస్కొని కలుపుకోవాలి
  13. కొత్తిమీర పుదీనా పచ్చి మిర్చి పేస్ట్ చేసుకొని తయారు చేసుకొన్న పానీలో కలుపుకొంటే పానీ పూరి పానీ రెడి
  14. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి
  15. తయారు చేసుకొన్న పూరి తీసుకొని వేలితో ముద్యలో కన్నం పెట్టి ఆలూ మిక్స్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి
  16. తర్వాత పూరి నిండే వరకు పానీ పోసుకొని తినేయడమే

నా చిట్కా:

పూరి కొంచం దళసరిగా చేసుకొంటే బాగా పొంగుతాయి

Reviews for Paani Poori Recipe in Telugu (0)