Photo of Kachori by pranali deshmukh at BetterButter
706
1
0.0(0)
0

కచోరి

Dec-10-2018
pranali deshmukh
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కచోరి రెసిపీ గురించి

చాలా టెస్టీ స్నాక్స్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు - 1 కప్పు
  2. పచ్చిమిర్చి- 1 స్పూన్
  3. అల్లం వెల్లుల్లి ముద్ద- 1 స్పూన్
  4. ఇంగువ- చిటికెడు
  5. గరం మసాలా- 2 స్పూన్లు
  6. కారం- 1 స్పూన్
  7. ఆమ్చూర్ పొడి- 2 స్పూన్లు
  8. మైదా - 2 కప్పులు
  9. నెయ్యి లేదా నూనె- 1/2 కప్పు
  10. ఉప్పు- తగినంత
  11. నూనె వెయించడానికి సరిపడ

సూచనలు

  1. మొదటగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి, ఉప్పు, మైదా వేసి అన్నింటి కలిపి బ్రెడ్ పొడిలా తయారయ్యే వరకు కలపి తర్వాత కొద్దిగా నీటిని జత చేసి ముద్దలా కలుపుకొని అరగంట నాననివ్వాలి.
  2. పెసరపప్పును శుభ్రం చేసి నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత నీరు వంపేసి తడి ఆరిన తర్వాత గ్రైడర్ లో ఇడ్లీ రవ్వలా చేసుకోవాలి.
  3. వెడల్పాటి పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక ఇంగువ, జిలకర్ర, గ్రైండ్ చేసిన పప్పును వేసి వేయించాలి. తర్వాత కారం, ఆమ్చూర్ పొడి, సోంపు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
  4. ఇప్పుడు మైదాను తీసుకొని చిన్న ఉండలు చేసి అరచేతిలో పెట్టుకొని వేడల్పుగా చేసి మద్యలో పెద్ద చెంచాడు వేయించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్ని వైపులా అంచులు మూసేసి వేడల్పుగా చేసుకోవాలి, ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి.
  5. పాన్ లో నూనె పోసి వేడయ్యాక తయారుచేసుకొన్న వాటిని నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. అప్పుడే కచోరి లోపలివరకు కాలి, పొరలు పొరలుగా ఉంటుంది.
  6. ఫైనల్ గా తయ్యారయిన కచోరిలను ఒక ప్లేట్ లో తీసుకొని టమోటో సాస్, స్వీట్ చట్నీ తో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర