హోమ్ / వంటకాలు / అటుకుల టిక్కీ (ఆలూ లేకుండా)

Photo of Rice flakes tikki  by Swapna Tirumamidi at BetterButter
517
5
0.0(0)
0

అటుకుల టిక్కీ (ఆలూ లేకుండా)

Dec-11-2018
Swapna Tirumamidi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల టిక్కీ (ఆలూ లేకుండా) రెసిపీ గురించి

టిక్కీ అనగానే అందరికీ బంగాళదుంప లేకుండా చేయలేము బాబోయ్ అనుకుంటారు ఈసారి నా పద్ధతి లో చేసిచూడండి. చాలా బావుంది.నిజంగా ఇదొక కొత్తరుచి డైటింగ్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు ఎందుకంటే బంగాళదుంప లేదు ఇంకా నూనెలో దేవట్లేదు ఇందులో వాడే పదార్ధాలన్నీ ఆరోగ్యం పెంచేవే పిల్లలు ఐతే చాలా ఇష్టపడతారు ఉదయపు టిఫినులా లేదా సాయంకాలం చిరుతిండి లా కూడా తినవచ్చు భోజనం ముందు సూప్ తో పాటు స్టార్టర్ లా కూడా చాలా బావుంటాయి.పిల్లలకు బాక్సలో సద్దవచ్చు..తప్పకుండా చేసి తినవల్సిన ఐటమ్ ఇది.ఈ రెసిపీ,ఫోటోలు నా సొంతం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. కాబూలీ శెనగలు ఉడికించిన ముద్ద ముప్పావు కప్పు
  2. అటుకులు 1 కప్పు
  3. చుక్కకూర సన్నగతరిగినది 3 పెద్ద చెంచాలు
  4. కొత్తిమీర తురుము 2 పెద్ద చెంచాలు
  5. గరం మసాలా పొడి అర చెంచా
  6. ధనియాలపొడి అర చెంచా
  7. జీలకర్ర అర చెంచా
  8. వెల్లుల్లి ముద్ద అర చెంచా
  9. పచ్చిమిర్చి 5
  10. వేయించి దంచిన వేరుశెనగ/జీడిపప్పు పలుకులు 4 చెంచాలు
  11. బ్రెడ్ పొడి అర కప్పు
  12. నూని ఒక కప్పు.

సూచనలు

  1. శెనగలు నాన పెట్టి తగినంత నీరు పోసి మెత్తగా ఉడికించి ,నీరు పారపోయకుండానే పాప్పు గుత్తితో బాగా మెదిపి ముద్దలా చేయాలి.
  2. అటుకులు బాగా కడిగి,నీరు తీసేసి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు శెనగల ముద్దలో ఈ అటుకులు వేసి బాగా కలపాలి.చపాతీ ముద్దలా ఉండాలి.నీళ్లు వేయకూడదు.
  4. ఇప్పుడు బ్రెడ్డుపొడి సగం ప్లేట్ లోకి తీసుకుని మిగతా సగం ఈ ముద్దలో కలపాలి.
  5. ఇప్పుడు చుక్కకూర తరుగు,కొత్తిమీర తురుము, వెల్లుల్లి ముద్ద,గరంమసాలా పొడి,ఉప్పు,ధనియాలపొడి,పచ్చిమిర్చి మిశ్రమం,దంచిన పప్పుల పొడి అన్ని వేసి బాగాకలిపి నిమ్మకాయంత ఉండలు చేసి పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు ఆ ఉండలని చేతితో వత్తుతూ కావలసిన ఆకారంలో చేసుకోవాలి
  7. ఇలా వత్తిన టికీలను బ్రెడ్ పొడిలో అన్ని వైపులా అద్ది పెట్టుకోవాలి
  8. ఇప్పుడు సమాంతరంగా ఉన్న పెనం పొయ్యిమీద పెట్టి మంటను మధ్యస్తంగా కన్నా కాస్త తక్కువలో పెట్టి ,ఒక చెంచాడు నూనె వేసి, బ్రెడ్ పొడి అద్దిన టిక్కిలను జాగర్తగా పెనం మీద వేసి కాల్చుకోవాలి.5నిమిషాలు సేపు .
  9. పైన కాస్త నూనె వేసి రెండోపక్క కూడా 5 నిమిషాల సేపు కాల్చుకోవాలి
  10. అంతే అండి చక్కగా పైన కరకర లాడుతూ ...లోపల మెత్తగా,మధ్యలో కమ్మని పప్పులు...చుక్కకూర పులుపు పంటికి తగులుతూ,ఎంతో రుచిగా...ఆరోగ్యం కరమైన అటుకుల టిక్కీలు మీకోసం సిద్ధం.
  11. నేను చెప్పిన కొలతలకి సుమారుగా 16 టిక్కీలు అయ్యాయి నాకు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర